Deputy CM Pawan Kalyan: కడప జిల్లాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవహర్ బాబును ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఆధిపత్యం అహంకారంతో అధికారులపై దాడులు చేస్తున్నారు.. ఇష్టారీతిన చేస్తామంటే చూస్తూ ఊరుకోం.. తాట తీస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదు.. ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నారు.. ఎంపీడీవో జవహర్ బాబును అమానుషంగా కొట్టారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Read Also: Manmohan Singh Last Rites: ముగిసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
అయితే, అహంకారంతో వాళ్లకు కళ్లు నెత్తికెక్కాయి.. అధికారులపైనా దాడి చేసినా చూస్తూ ఊరుకోం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఘటనా స్థలానికి సీఐ వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్ కాలేదని తెలిపారు. ఇది కూటమి ప్రభుత్వం.. వైసీపీ కాదు, మిమ్మల్ని ఎలా నియంత్రించాలో మాకు తెలుసు అన్నారు. మీకు 11 సీట్లు వచ్చినా ఇంకా గాల్లో విహరిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు, సింహాద్రిపురంలో రైతు కుటుంబం ఆత్మహత్య దురదృష్టకరం అన్నారు. రైతు కుటుంబం ఆత్మహత్యపై పోలీస్ నివేదిక అడిగాం.. ఎవరైనా బలవంతం చేస్తే చనిపోయారా.. అనేది విచారణలో తేలుతుంది.. సినిమాల గురించి చర్చ పెట్టకండిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు.