Perni Nani: డిసెంబర్ 10వ తేదీ నుంచి నా భార్య జయసుధ పేరు మీద మచిలీపట్నంలో ఉన్న గోడౌన్ ఆఫర్ లెటర్ ఇచ్చి అద్దెకు తీసుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. అక్రమార్కుడిగా నేనేదో ఉద్దేశ్య పూర్వకంగా తప్పుడు పనులు చేసానని అత్యుత్సాహంతో ఆరోపణలు చేశారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు.. మా అత్తమామలు నిర్మాణం చేసి గోడౌన్ మాకు ఇచ్చారు.. 60 ఏళ్లు వచ్చాయి.. పనులు చేసుకోలేక పోతే అద్దెలు వస్తాయని నిర్మాణం చేశాం.. నేను, కానీ నా భార్య కానీ రోజు వెళ్లి చూసేదేమీ ఉండదు.. మా దగ్గర ఉన్న మేనేజర్ అక్కడ స్టాక్ లో తేడాలు ఉన్నాయని చెప్పారు.. స్టాకులో లోపం ఉందని తెలిశాక 26 నవంబరున జాయింట్ కలెక్టర్ కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం.. మా వల్ల తప్పు లేకపోయినా స్టాక్ తగ్గిందనికి నైతిక బాధ్యత వహించి లేఖ ఇచ్చాం.. అధికారులు ఫిజికల్ గా స్టాక్ వెరిఫై చేసి సివిల్ సప్లయిస్ ఎండీకి లెటర్ రాశారు.. ఈనెల 10వ తేదీన వారు క్రింది స్థాయి అధికారులకు డబ్బులు కట్టించుకుని క్రిమినల్ కేసు పెట్టాలని ఆదేశించారని పేర్నినాని చెప్పుకొచ్చారు.
Read Also: AP DGP: మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు..
అయితే, డిసెంబర్ 10న కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నా భార్య జయసుధతో పాటు ఇతర అధికారులను అటెస్ట్ నోటీసులు ఇచ్చారు అని మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. 3,708 బస్తాల స్టాక్ వేరియేషన్ కనిపిస్తుంది.. 1.70 లక్షలు మూడు రోజుల్లోగా కట్టాలని గోడౌన్ దగ్గర అంటించి వెళ్ళారు.. అప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైనందున మా లీగల్ టీం ఉద్దేశ్య పూర్వకంగానే అధికారులు ఇలా చేసి ఉంటారని గుర్తించారు.. మా కుటుంబ సభ్యులందరం ఆ డబ్బులు జమ చేశాం.. కేవలం నైతిక బాధ్యత వహించి డబ్బులు జమ చేశాం తప్ప ఏ తప్పు చేయలేదని ఓ లెటర్ కూడా ఇచ్చామన్నారు. 11వ తేదీన జిల్లా కోర్టులో నా భార్య జయసుధ బెయిల్ కోసం అప్లై చేసింది.. బెయిల్ రాకుండా ఉండేందుకు కూడా పలు ప్రయత్నాలు చేశారు.. ఏదో రకంగా నన్ను, నా భార్యను అరెస్టు చేయాలని రాజకీయ కక్ష్యతో చేశారు.. నేను ఎక్కడకు పారిపోలేదు.. మీ కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద కేసులు పెడితే వారిని రక్షించివాలని చూస్తారా.. లేక జైలుకు పంపిస్తారా అని ప్రశ్నించారు. నేను తప్పు చేశానని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా.. కేవలం అద్దెకు ఆశపడి గోడౌన్ కట్టటం తప్ప మేము చేసిన తప్పేంటి అని పేర్నినాని అడిగారు.
Read Also: Manmohan Singh Last Rites: ముగిసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
కాగా, నిజంగా తప్పుడు పనులు చేయాలంటే ఎవరైనా ఇలా చేస్తారా అని పేర్నినాని పేర్కొన్నారు. నేనేమైనా తప్పుడు పనులు చేసే వ్యక్తినా.. ఒక రాష్ట్రానికి మంత్రిగా చేసిన వ్యక్తిని ఉద్దేశ్య పూర్వకంగా పని చేస్తానా.. డీజీపీగా పని చేస్తున్న వ్యక్తి.. గతంలో ఆయన ఆర్టీసీ ఎండీగా.. నేను రవాణా శాఖ మంత్రిగా పని చేశాం.. నేనెప్పుడైనా ఏవైనా తప్పుడు పనులు చేయించానా.. నా గురించి చెడుగా మాట్లాడుతున్న ఓ మంత్రి.. నా భార్య మీద కేసు పెట్టడం దగ్గర నుంచి అరెస్ట్ చేయాలని అన్నీ ప్రయత్నాలు చేశారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుకు చెబితే ఆయన ఒప్పుకోలేదు.. ఇంట్లో ఆడవాళ్ళ మీద కేసులు ఏంటి అని చెప్పి చంద్రబాబు వెళ్ళిపోయారు.. మీరు కావాలంటే నానిని, వాళ్లబ్బాయిని అరెస్ట్ చేయాలని చంద్రబాబు చెప్పారు.. రాజకీయ వైరం ఉంటే నా మీద చూసుకోవాలి.. ఇంట్లో ఉండే నా భార్య ఏం చేసిందని మండిపడ్డారు. నన్ను, నా కొడుకును అరెస్టు చేయడమే కదా మిగిలింది.. చేయండి ఇంకా మీ ఇష్టం కదా.. చంద్రబాబు తిట్టిన తర్వాత కూడా బెయిల్ రాకుండా అనేక ప్రయత్నాలు చేశారు.. గోడౌన్ దగ్గర నానా హంగామా చేశారు.. అక్కడ జరిగినవన్నీ లాయర్లు వీడియోలు తీశారు.. ప్రతీ విషయంలో బయటకు వచ్చి మాట్లాడే నాని ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు.. నేను కొన్ని రోజుల ముందే మాట్లాడాలని చూసినా కోర్టులో కేసు నడుస్తున్నందున మా లాయర్లు చెప్పటంతో ఆగిపోయా అని పేర్కొనాని చెప్పుకొచ్చారు.