* నేటి ఉదయం 11.45 గంటలకు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు.. ఉదయం 8గంటలకు మన్మోహన్ నివాసం నుంచి ఏఐసీసీ కార్యాలయానికి పార్థివదేహం తరలింపు.. ఉదయం. 8.30 నుంచి 9.30 వరకు ఏఐసీసీ కార్యాలయంలోనే పార్థివదేహం.. నివాళులర్పించనున్న కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు.. ఉదయం. 9.30 గంటలకు ప్రారంభంకానున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర..
* నేడు కడప జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించనున్న పవన్.. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎంపీడీవో..
*నేడు ఏపీ డీజీపీని కలవనున్న బీజేపీ నేతలు.. తిరుమల పరకామణి దొంగతనంపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్న నేతలు.. డీజీపీని కలవనున్న టీటీడీ బోర్డ్ మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి, బీజేపీ నేతలు..
* నేడు టీడీపీ ఆఫీసులో ప్రజా దర్భార్.. ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించనున్న చంద్రబాబు..
* నేడు పీజేఆర్ 17వ వర్ధంతి.. ఖైరతాబాద్ ప్లైఓవర్ దగ్గర పీజేఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్న మంత్రి శ్రీధర్ బాబు, ఇతర నేతలు..
* నేటి మధ్యాహ్నం 12 గంటలకు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్..
* నేడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమావేశం.. పాల్గొననున్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.
* నేటి నుంచి విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు.. రెండు రోజుల పాటు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు.. పలు దేశాల నుంచి హాజరుకానున్న ప్రతినిధులు..
* నేడు, రేపు విశాఖలో ఇండియన్ నేవీ సన్నాహక విన్యాసాలు.. విశాఖ వేదికగా జనవరి 4న నేవీ విన్యాసాలు..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం.. 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు..
* తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 71,510.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 78,010.. హైదరాబాద్ లో కిలో వెండి రూ.99,900.