Tirumala Parakamani: తిరుమలలో ఉన్న పరకామణి పై వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు పూర్తి విచారణ కోరారు. బీజేపీ నాయకులు భాను ప్రకాశ్ రెడ్డి, పాతూరి నాగభూషణం ఇటీవల రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావును కలిసినప్పుడు, తిరుమల పరకామణిలో విదేశీ డాలర్ల మాయపై పూర్తి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. వారు, తిరుమల పరకామణిలో కనిపించకుండా పోయిన విదేశీ కరెన్సీ పై కూడా విచారణ జరిపించాలని కోరారు. ఈ కరెన్సీ పై ఆందోళన వ్యక్తం చేసారు బీజేపీ నేతలు. భక్తులు ఇచ్చే కానుకలలో 100 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతున్నట్లు ఆరోపించారు. దీనిని తీవ్రంగా పరిగణించాలని పేర్కొన్నారు.
Also Read: ATM Fraud: కామారెడ్డిలో కేటుగాడు.. ఏటీఎం కార్డు మార్చి రూ.40 వేలు కాజేసిన దుండగుడు..
ఈ వ్యవహారంలో ప్రముఖ ఆరోపణలు కూడా ఉన్నాయి. గత రెండు సంవత్సరాలుగా, తిరుమల జీయర్ అసిస్టెంట్ రవికుమార్ అమెరికన్ కరెన్సీని కాజేస్తున్నాడని ఆరోపించారు. సెక్షన్ 379, 389 కింద నేరం ఆరోపింపబడిన రవికుమార్, గత ప్రభుత్వ ప్రలోభాలతో మాయ చేసుకున్నారని ఆరోపించడమైంది. ఈ వ్యవహారం పై లోక్ అదాలత్ తీర్పును సైతం కోర్టులో ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా, రవికుమార్ తో 72 వేల రూపాయల లంచం తీసుకొని చేతులు దులుపుకున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. తిరుమల పరకామణి వ్యవహారంపై మరింతగా విచారణ చేపట్టేందుకు బీజేపీ నేతలు కోరుతున్నారు.