Kadapa: కడప జిల్లాలోని సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక నాగేంద్ర అనే రైతు కుటుంబం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మొదట తన ఇద్దరు పిల్లలకు వ్యవసాయ పొలానికి చెందిన గేటుకు ఉరివేసి చంపి ఆపై భార్యాభర్తలు చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నారు. మృతులు.. నాగేంద్ర, భార్య వాణి, కుమార్తె గాయత్రీ(14), కుమారుడు భార్గవ్(15)గా గుర్తించారు.
Read Also: Deputy CM Pawan: నేడు కడపకు డిప్యూటీ సీఎం పవన్.. ఎంపీడీవోకు పరామర్శ
అయితే, గతంలో 8 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయగా నష్టాలు వచ్చాయి. డైరీ ఫార్మ్ ఓపెన్ చేయగా 5 ఏనుములు మిస్సింగ్ అయ్యాయి.. ఆపై గోర్ల వ్యాపారం చేయగా ఒకేసారి 48 గొర్రెలు మృతి చెందాయి.. ప్రస్తుతం కొర్ర సాగు చేయగా వర్షాలకు పంట పూర్తిగా దెబ్బ తిన్నది.. దాదాపు 30 లక్షలు అప్పులు కాగా వాటిని తీర్చాలని వాళ్ళు వేధింపులకు గురి చేయడంతో.. ఆ బాధలు తాళలేక కుటుంబంతో కలిసి మొదట గేటుకు పిల్లలకు ఉరివేసిన తర్వాత భార్యాభర్తలు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.