టమోటా రైతును కదిలిస్తే కన్నీళ్లు కదలుతున్నాయి.. మూడు నెలలపాటు శ్రమిస్తే వారికి నష్టాలే మిగిలాయి. ఆరుగాలం కష్టపడిన టమాటా రైతులు మద్దతు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాడు. చేతికొచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలులేక కొందరు తోటలోనే వదిలేస్తుంటే.. కూలీలను పెట్టించి కోయించినా గిట్టుబాటు ధర రావటంలేదని మరికొంత మంది రైతులు వాపోతున్నారు.
ఆ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేశాడు తాడేపల్లి మండలం పాతూరు గ్రామానికి చెందిన అంజిబాబు అనే ఇండియన్ బ్యాంకు ఖాతాదారుడు.. అయితే, డిపాజిట్ చేసిన నోట్లలో 18 వేల రూపాయల దొంగ నోట్లు ఉండడంతో అకౌంట్లో ఆ మొత్తం జమ కాలేదు.. ఇక, తాను 50,000 డిపాజిట్ చేయగా అందులో 18,000 డిపాజిట్ అవ్వలేదని బ్యాంకు మేనేజర్ కు సదరు ఖాతాదారుడు ఫిర్యాదు చేశాడు.
నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.. జైలు సూపరింటెండెంట్ శ్రీరామ్ రాజారావు అవినీతి, అక్రమాలపై అధికారులు నోరువెల్లబెడుతున్నారు.. రిమాండ్ ఖైదీల తాలుకు బంధువుల నుంచి నగదు, మద్యం డిమాండ్ చేసిన ఫోన్ సంభాషణ మరువకముందే వెలుగులోకి మరో అవినీతి బాగోతం వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కొరతకు చెక్ పెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. విద్యుత్ కోతలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ లో బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 5200 కోట్లతో 1000 మెగావాట్ల విద్యుత్ నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కేంద్రం నిధులు విడుదల చేయనున్నది.
'జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు.. ఎవరూ అనవసరమైన వివాదాలు, విభేదాల జోలికి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు పవన్ కల్యాణ్. ‘కూటమిలోని మూడు పార్టీల శ్రేణులూ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గత విషయాలపై పొరపాటున కూడా ఎవరైనా స్పందించినా, మరెవరూ ప్రతిస్పందించొద్దు. మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించొద్దు. బహిరంగంగా చర్చించొద్దు అని సూచిస్తూ.. జనసేన శ్రేణులకు బహిరంగ లేఖ విడుదల చేశారు పవన్ కల్యాణ్.
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.. తాజాగా గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఆదివారం (26 జనవరి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 75,550, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 82,420 గా ఉంది. వెండి కిలో ధర రూ. 97,500 లుగా ఉంది.