Konaseema Kuridi Coconut: కుంభమేళా ప్రభావంతో కోనసీమ కురిడి కొబ్బరి కి అనుకోని డిమాండ్ వచ్చింది… ప్రయాగ్ రాజ్ కి కోనసీమ నుంచి కొబ్బరి ఎగుమతులు జరుగుతున్నాయి.. అయితే, కొబ్బరి అంటే ముందుగా గుర్తొచ్చేది కోనసీమ.. వేల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుంది.. కొబ్బరికాయలో నీళ్లు ఉంటే దానిని పచ్చి కొబ్బరి అంటారు.. అయితే లోపల , కొబ్బరి చుట్టు పెంకు, నీళ్లు లేకుండా ఉండడాన్ని కురిడీ కొబ్బరి అంటారు… చెట్టు నుంచి రాలిపోయిన కొబ్బరి నీడలో ఎండబెట్టి తరువాత ఆరబెడితే అది కురిడీ కొబ్బరి అవుతుంది.. ఉత్తరప్రదేశ్ లో మహా కుంభమేళా జరుగుతుంది.. అయితే అక్కడ పుణ్య స్నానాలు ఆచరించి, నదికి కురిడి కొబ్బరి సమర్పించడం సాంప్రదాయంగా ఉంది.. దాంతో కుంభమేళాకి కోనసీమ నుంచి కురిడి కొబ్బరి ఎగుమతులు భారీగా పెరిగాయి.. దశాబ్ద కాలం గా ఎప్పుడు లేని విధంగా ట్రాన్స్‌పోర్ట్ జరుగుతుంది..
Read Also: Delhi Red Fort: ఎర్రకోట రంగును ఎవరు మార్చారు.. అంతకు ముందు ఏ రంగులో ఉండేది ?
మామూలుగా మహా కుంభమేళా కి తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి కురిడి కొబ్బరి దిగుమతులు చేసుకోవాలని అనుకున్నారు.. అయితే ఆ రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు దిగుమతులు ఉండడంతో కోనసీమ వైపు మొగ్గు చూపారు.. రోజుకు దాదాపు రెండు లక్షలు కురిడి కొబ్బరికాయలు ఈ ప్రాంతం నుంచి తరలిస్తున్నారు. ధర కూడా గతంలో ఎప్పుడు లేనివిధంగా భారీగా పెరిగింది.. ఇంతకు ముందు ఒక్కొక్క కురిడి కొబ్బరికాయ పది రూపాయలు ఇవ్వాలంటే అబ్బో చాలా ధర అనే వారు. అప్పుడు 20 నుంచి 25 రూపాయల వరకు ఈజీగా పలుకుతుంది.. దాంతో కొబ్బరి రైతుల పంట పండినట్లు అయింది.
Read Also: Coconut Water: కొబ్బరి నీళ్లు తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని మీకు తెలుసా..?
మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు ఉంది..45 రోజులు పాటు నిర్విరామంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంది.. కోనసీమ పరిసర ప్రాంతాల నుంచి 100 కొబ్బరికాయలు బయటకు వెళ్తుంటే అందులో వాటర్ కోకోనట్స్ 20 మాత్రమే ఉంటున్నాయి.. మిగతా 80 కూడా ఎండు కొబ్బరి అంటే కురిడి కొబ్బరి ఉంటున్నాయి.. ఇతర రాష్ట్రాలలో కూడా కొబ్బరి దిగుబడి ఈ ఏడాది తగ్గడం కోనసీమ రైతులకు కలిసొచ్చింది.. దానివలన అనూహ్యమైన ధర పలుకుతుంది.. కురిడీలో గండేర రకానికి డిమాండ్ మరింత ఎక్కువ ఉందని రైతులు చెప్తున్నారు.. కురిడీకి వచ్చిన అనూహ్యమైన ధర తో అటు రైతులు వ్యాపారులు, మరో వైపు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్లు, కూలీలకు చేతినిండా పని దొరుకుతుంది.. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుంది.. ఈసారి కొబ్బరి రైతులకు అధిక లాభాలు వస్తాయి.. కురిడీకి ఉన్న డిమాండ్ తో ధరలు మరింత పెరుగుతాయని రైతులు అనుకుంటున్నారు.. గతంలో కురిడిని ఆయుర్వేదం మందులు తయారీకి, వంటలలో మాత్రమే వినియోగించేవారు. దాంతో ఇప్పటివరకు కురిడీని అంతంత మాత్రం గానే కొనుగోలు చేస్తున్నారు.. ఇప్పుడు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. మొత్తానికి మహా కుంభమేళా కోనసీమ కొబ్బరికి కలిసొచ్చింది.. కురిడీ కొబ్బరి ధరలు అంతంకంతకు పెరగడంతో రైతులు ఉబ్బి తబ్బిబై పోతున్నారు..