Chandrababu: నీతి ఆయోగ్ నివేదికపై మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే కిందకు పడిపోయిందని ఆరోపించారు.
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక పోతున్నామని చెప్పేశారని తెలిపారు. వైఎస్ జగన్ ఇంత విధ్వంసం చేశాడని చంద్రబాబు ఉహించలేదంట.. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు.. అందుకే సీఎం చంద్రబాబు హామీలు అమలు చేయడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
Nadendla Manohar: పేదల ఇళ్ల స్థలాల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద ల్యాండ్ స్కాం.. తెనాలిలో జరిగిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. కొంత మంది పేదల భూముల పేరుతో.. రైతులకు తక్కువ డబ్బు ఇచ్చి ప్రభుత్వం దగ్గర ఎక్కువ మొత్తాన్ని దోచేశారు అని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేనా ఓ సంచలనం. జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఆధ్వర్యంలో పార్టీ కూటమితో కలిసి అధికారంలోకి వచ్చింది. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో విపక్ష పార్టీల నుంచి పలువురు నాయకులు జనసేనలోకి వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జనసేనాలోకి చేరికలు మొదలయ్యాయి. వైసీపీ నుంచి పలువురు క్షేత్రస్థాయి నాయకులు జనసేన పార్టీ కండువ కప్పుకున్నారు. జనసేన కేంద్ర కార్యాలయంలో నందిగామ నుంచీ పలువురు వైసీపీ నాయకులు…
CM Chandrababu: నీతి అయోగ్ రిపోర్టుపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటాం.. తగిన జాగ్రత్తలు తీసుకుంటాం..
ఓ వైపు ఏఐతో అద్భుతాలు ఆవిష్కృతమవుతుంటే సమాజంలో ఇంకా మూఢ విశ్వాలు వీడడం లేదు. సైంటిస్టులకంటే.. బాబాలే ఫేమస్. అరచేతిలో స్వర్గాన్ని చూపించి అందినకాడికి దోచేస్తున్నారు ఫేక్ బాబాలు. అమాయకులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్నారు. కాగా గతేడాది మిషన్ అహం బ్రహ్మాస్మీ మోసాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఆధ్యాత్మికత పేరుతో ఆస్తులు దోచేస్తూ కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కుటుంబ సభ్యులను లొంగదీసుకుని దూరం చేస్తున్నారని మిషన్ అహం బ్రహ్మస్మీ సంస్థపై కంప్లైంట్…
Nimmala Ramanaidu: గత విధ్వంస పాలనకు నిదర్శనం ఇరిగేషన్ ప్రాజెక్టులే అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 17 నెలల పాటు పోలవరం ఆలన పాలన లేకుండా చేశారు.. పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది కూటమి ప్రభుత్వం.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచీ నాలుగు వేల క్యూసెక్కులు అయినా ఉత్తరాంధ్రకు ఇవ్వాలని సీఎం అన్నారు..
బీసీలను పార్లమెంట్ మెట్లు ఎక్కించిన ఘనత టీడీపీది.. బీసీలకు నూతన పథకాలు ప్రారంభమయ్యాయంటే.. అది టీడీపీ ప్రభుత్వంలోనే.. బీసీలకు రిజర్వేషన్లు పెట్టిన ఘనత చంద్రబాబుది.. దావోస్, అమెరికాలాంటి దేశాల్లో కూడా బీసీలు ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగారంటే చంద్రబాబు చేసిన కృషి కారణం అని రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు.
వైజాగ్ వచ్చే పర్యాటకులు బీచ్లో కూర్చుని టీ తాగడానికి రారు.. వాళ్లకు కావాల్సింది ఎంజాయ్మెంట్ అన్నారు అయ్యన్నపాత్రుడు.. నిబంధనల పేరుతో నియంత్రణ పెడితే పర్యాటకులు రారన్న ఆయన.. ఎంజాయ్ చేయడానికి అవసరమైన సౌకర్యాలు ఉండాలన్నారు. టూరిజంకు మినహాయింపులు ఇవ్వాలని పేర్కొన్నారు.. రూల్స్ అవసరమే.. కానీ, కొంత వెసులు బాటు వుండాలన్నారు.. గిరిజన ప్రాంతాలలో పెట్టుబడి పెట్టేందుకు స్థానికులు ఉండాలనే నిబంధనకు పరిష్కారం చూడాలి.. ఆఫీసియల్స్ పాజిటివ్ మైండ్తో వుండాలన్నారు.