MLC elections: ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలో అమ్మ్ ఆద్మీ పార్టీ పనితీరును ఆదర్శంగా తీసుకుని పని చేయాలని పిలుపునివ్వడం ఆశ్చర్యానికి గుర్తు చేసింది. రాజమండ్రిలో జరిగిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సమాయత్తా సమావేశంలో పేరాబత్తుల రాజశేఖర్ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి.. ఢిల్లీ ఎన్నికల్లో అమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయవద్దని ప్రచారం చేస్తుంటే.. ఇక్కడ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఉన్న రాజశేఖర్ ఇందుకు విరుద్ధంగా.. ఎన్నికల ప్రచారం చేయడం వివాదాస్పదం అయ్యింది..
Read Also: Sanju Samson: ఐపీఎల్‌కు ముందు రాజస్థాన్‌కు భారీ దెబ్బ.. శాంసన్‌కు గాయం
అమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నిబద్ధత పనిచేయటం కారణంగానే ప్రజలు పట్టం కడుతున్నారని కొనియాడారు. అయితే, కూటమిలోని పార్టీల అధినేతలు.. అమ్ ఆద్మీ పార్టీ అవినీతి పార్టీ అని ప్రచారం చేస్తుంటే.. ఎమ్మెల్సీ అభ్యర్థి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం జనసైనికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎమ్మెల్సీ ఓటమి అభ్యర్థి వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు గుసగుసలు లాడుకుంటున్నారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా రాజశేఖర్ నిలబెడితే.. బీజేపీకి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయటం ఏమిటంటూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు.. రాజశేఖర్ వ్యాఖ్యలు యాదృచ్ఛికంగా చేశారా..? లేక ఉద్దేశ పూర్వకంగా? వివాదస్పద వ్యాఖ్యలు చేశారా? అంటూ గుసగుసలు ఆడుకుంటున్నారు.. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయాయి.