విజయసాయిరెడ్డి.. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ దగ్గరకు వెళ్లకముందే.. ఎంపీ గురుమూర్తి.. సాయిరెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు.. రాజీనామా చేయొద్దని సాయి రెడ్డిని కోరాను అని.. కానీ, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు విజయసాయిరెడ్డి చెప్పడంలేదన్నారు.. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి సమస్యలు లేవు అని స్పష్టం చేశారు ఎంపీ గురుమూర్తి..
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి.. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్తో సమావేశమైన ఆయన.. తన రాజీనామా లేఖను అందజేశారు..
సోషల్ మీడియాలో ప్రకటించిన విధంగానే రాజీనామాకు సిద్ధం అయ్యారు విజయసాయి రెడ్డి.. మరికాసేపట్లో అంటే ఉదయం 10.40 గంటలకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ తో భేటీకానున్నారు సాయిరెడ్డి.. తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి అందజేయనున్నారు..
పార్టీ ఆదేశాలతో ఢిల్లీ బయల్దేరారు వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్.. రాజ్యసభ సభ్యత్వానికి విజయ సాయిరెడ్డి రాజీనామా తర్వాత పార్టీ ఆదేశాలు మేరకు ఢిల్లీలో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. ఒత్తిడితోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తానని చెప్పి ఉండొచ్చన్న ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు బోస్..
రాజ్యసభలో పెద్దలుంటారు.. వయసులో కాదు.. హోదాలో.. అందుకే పెద్దల సభ అంటారు. మరిక్కడ ఏం జరుగుతోంది.. కొంతమంది. పెద్దల వ్యవహార శైలి ఎందుకు విచిత్రంగా ఉంటోంది. ప్రస్తుతం ఈ సందేహాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలైన.. టీడీపీ, వైసీపీల్లో రాజ్యసభ సభ్యుల తీరు మరింత ఆశ్చర్యంగా.. ఇంకొంచెం విచిత్రంగానూ ఉంది.. సాయిరెడ్డి రాజీనామాతో ఈ చర్చ బాగా ఎక్కువగా జరుగుతోంది.
విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటనపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వస్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అంతకుముందు.. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు.