CM Chandrababu: ప్రముఖ నటుడు, సూద్ ఛారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోనూసూద్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ ప్రభుత్వానికి తన ఫౌండేషన్ ద్వారా నాలుగు అంబులెన్స్‌లను అందించారు సోనూసూద్.. ఈ సందర్భంగా సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.. ఆ తర్వాత నాలుగు అంబులెన్స్‌లను చంద్రబాబు ప్రారంభించారు. మర్యాద పూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూద్‌ను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సీఎం..
Read Also: Karnataka: బోర్డుపై రాయలేకపోయిన సాంస్కృతిక శాఖ మంత్రి.. నెటిజన్లు సెటైర్లు
ఇక, సోనూసూద్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు సీఎం చంద్రబాబు.. “సోనూసూద్.. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది! సూద్ ఛారిటీ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు అంబులెన్స్‌లను ఉదారంగా విరాళంగా ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ ప్రశంసనీయమైన చొరవ ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేస్తుంది.. మారుమూల ప్రాంతాలలో సకాలంలో వైద్య సంరక్షణను నిర్ధారిస్తుంది. సమాజానికి సేవ చేయడానికి మరియు ఉద్ధరించడానికి మీరు చేసే గొప్ప ప్రయత్నాలలో మీరు నిరంతరం విజయం సాధించాలని కోరుకుంటున్నాను..” అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు..
It was a pleasure to meet you, @SonuSood! Thank you for the generous donation of ambulances to Andhra Pradesh through the @SoodFoundation. Your commendable initiative will strengthen healthcare services and ensure timely medical care in remote areas. Wishing you continued success… pic.twitter.com/HEzEudfAuT
— N Chandrababu Naidu (@ncbn) February 3, 2025
మరోవైపు.. సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన సోనూసూద్.. తెలుగు ప్రజలు నా గుండెల్లో ఉంటారు.. తెలుగు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు.. ఇవాళ మా ట్రస్ట్ తరపున అంబులెన్స్‌లను ప్రభుత్వానికి అందించాం.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి జరుగుతోంది. తెలుగు ప్రజలు నన్ను మంచి నటుడిగా తయారు చేశారు.. ఇక్కడ ఉన్న ప్రేమ ఎక్కడా దొరకదని పేర్కొన్నారు.. ఇక, కోవిడ్ సమయంలో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేశాం.. అప్పుడే నాపై తెలుగు ప్రజలు ప్రేమ చూపించారని సోనూసూద్ గుర్తుచేసుకున్న విషయం విదితమే..
Read Also: Railway Budget For AP: రైల్వే బడ్జెట్.. ఏపీకి భారీగా పెరిగిన నిధుల కేటాయింపు..
ఇక, సీఎం చంద్రబాబు, సోనూసూద్ భేటీపై ఎక్స్ (ట్విట్టర్)లో స్పందించిన ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి ఉదారంగా సహకరించినందుకు సోనూసూద్ మరియు సూద్ ఛారిటీ ఫౌండేషన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.. వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో మరియు అవసరమైన వారికి సకాలంలో సంరక్షణను నిర్ధారించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్.
Heartfelt gratitude to @SonuSood and @SoodFoundation for their generous contribution to strengthening healthcare services in Andhra Pradesh.
Such initiatives play a crucial role in enhancing medical infrastructure and ensuring timely care for those in need! https://t.co/i1y8YQnOJk
— Satya Kumar Yadav (@satyakumar_y) February 3, 2025