ప్రజలే ఫస్ట్... అనే నినాదంతో అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై ప్రజల అభిప్రాయలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి ఆధారంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు..
మరోసారి నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉందంటున్నారు.. ఈసారి, ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల పదవులు భర్తీ చేయనున్నారు.. రాష్ట్ర స్థాయిలో వివిధ కార్పొరేషన్ చైర్మన్.. డైరెక్టర్ల పదవులపై కసరత్తు చేస్తున్నారు.. దేవాలయాల పాలక మండళ్లపై కూడా దృష్టిసారించింది ప్రభుత్వం. ఇంద్రకీలాద్రి, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయాలకు పాలక మండళ్లు ఏర్పాటుపై.. జిల్లా…
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ టీమ్ దావోస్ పర్యటనపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న వేళ.. కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.. ఓ కేసులో కోర్టులో హాజరుఅయ్యేందుకు విశాఖ వచ్చిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడు నెలలలో ఆరు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చామని స్పష్టం చేశారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. వైసీపీలో లీడర్ల కంటే లోఫర్లు ఎక్కువ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. దావోస్ వెళ్లి పబ్జీ ఆడుకుని, బజ్జీలెక్కడ దొరుకుతాయో వెతుక్కుంటూ స్వెట్టర్ వేసుకుని తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు.. దావోస్ పర్యటనపై వైసీపీ నాయకుల మాటలు పనీ పాటా లేని విమర్శలుగా కొట్టిపారేశారు.
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎంపికను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.. డీజీపీ ఎంపికలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, యూపీఎస్సీ నిబంధనలు పాటించలేదని పిల్ వేశారు.. నిబంధనల ప్రకారం డీజీపీ పోస్ట్ కి అర్హత కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను ప్రభుత్వం యూపీఎస్సీ కి పంపాలని పిల్ లో పేర్కొన్నారు పిటిషనర్..
సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి భారీ ఊరట లభించింది.. వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ.. మరోవైపు జగన్ పై ఉన్న కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు గతంలో వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ కూడా డ్యాన్స్‌లు అదరగొట్టారు.. భార్యతో కలిసి సినిమా పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు కలెక్టర్ బాలాజీ..
టమోటా రైతును కదిలిస్తే కన్నీళ్లు కదలుతున్నాయి.. మూడు నెలలపాటు శ్రమిస్తే వారికి నష్టాలే మిగిలాయి. ఆరుగాలం కష్టపడిన టమాటా రైతులు మద్దతు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాడు. చేతికొచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలులేక కొందరు తోటలోనే వదిలేస్తుంటే.. కూలీలను పెట్టించి కోయించినా గిట్టుబాటు ధర రావటంలేదని మరికొంత మంది రైతులు వాపోతున్నారు.