సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలకు కొత్త టీంలు ఏర్పాటు అవుతున్నాయి.. సీఎం జిల్లాల పర్యటన, నియోజకవర్గాల్లో పర్యటనలను టీంలు మానిటరింగ్ చేస్తాయి. అందుకోసం జోన్ల వారీగా అధికారుల నియామకం కూడా జరిగింది. సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనలకు సంబంధించి కొన్ని మార్పులు చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అర్హత కలిగిన పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి కట్టుబడి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వం క్షమశిక్షణ లేని ఆర్ధిక ప్రణాళికల వల్ల హౌసింగ్ ప్రోగ్రామ్ కుంటుపడిందని ఆరోపించారు.
విజయసాయిరెడ్డి రాజీనామాపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. విజయసాయి రెడ్డికి కలలోకి గొడ్డలి వచ్చిందేమో, అందుకే భయపడి రాజీనామా చేసి ఉండొచ్చని హోంమంత్రి సెటైర్లు వేశారు.
పొరపాటున కూడా నేను పార్టీ మారను.. వైసీపీలోనే ఉంటాను అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్.. రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంతో ఢిల్లీ వెళ్లిన ఆయన.. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు.. విజయసాయి రెడ్డి రాజీనామా దురదృష్టకరం అన్నారు.. విజయసాయి రెడ్డి పార్టీకి, పార్లమెంట్ లోనూ వెన్నెముక లాంటివారని అభివర్ణించారు.
సాయిరెడ్డి అంశంపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. నమ్మకం ఉంటే ఉంటారు.. లేకపోతే వెళ్ళిపోతారని వ్యాఖ్యానించారు.. అయితే, పార్టీ పరిస్థితి కూడా ముఖ్యం అన్నారు.. కానీ, ఇది వాళ్ల (వైసీపీ) ఇంటర్నల్ వ్యవహారం అన్నారు.. వ్యక్తిగత కోపంతో వ్యవస్థను నాశనం చేసిన పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా లేదన్నారు.. రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తులు వస్తే ఇదే పరిస్థితి వస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు..
సామాన్య మానవుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు సీఎం చంద్రబాబు.. గ్రోత్ రేట్ పెరిగితేనె అభివృద్ధి సాధ్యం అన్నారు.. దావోస్ పర్యటన పూర్తి సంతృప్తి ఇచ్చిందన్నారు చంద్రబాబు.. ఇప్పుడు ఏపీ బ్రాండ్ ప్రమోషన్ కొత్త గా చేయాలన్నారు. ఏఐ.. డీప్ టెక్కు సంబంధించి బిల్ గేట్స్ తో చర్చ జరిగింది అన్నారు చంద్రబాబు.. మిలింద గేట్ ఫౌండేషన్ తో హెల్త్ కు సంబంధించి ఒక ప్రాజెక్ట్ చేద్దామని బిల్ గేట్స్ చెప్పారన్నారు చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్పీల ప్రమోషన్ల విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. ప్రమోషన్లపై ఇచ్చిన ఆదేశాలు రీ రివ్యూ చేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది..
రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి.. ఈ రోజు భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు... ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.. నా రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారు.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానన్న ఆయన.. వైసీపీ అధినేత వైఎస జగన్‌తో అన్నీ మాట్లాడాకే రాజీనామాపై నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు..