శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది... శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తపడుతుంది.. అందుకే ఏర్పాట్లలో మంత్రులను రంగంలోకి దింపింది.
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్, సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో నలుగురు నెయ్యి సరఫరాదారులు అరెస్ట్ చేశారు. ఏర్ డైరీ ఏండీ రాజశేఖరన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు బోలేబాబా డైరీ నిర్వాహకులతోపాటు.. నెల్లూరు వైష్ణవీ డైరీకి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి నివాసంలో నిందితులను ప్రవేశపెట్టింది సిట్.
ప్రమాదకరమైన ధార్ గ్యాంగ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో మకాం వేసిందా.. వరుస దొంగతనాలు ఆ గ్యాంగ్ పనేనా..? పల్నాడు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది ఈ ప్రశ్న.. పగలంతా రెక్కీ చేస్తారు, తాళాలు వేసిన ఇళ్లకు కాపలా పడుకుంటారు.. సరిగ్గా సమయం కుదిరింది అనుకుంటే ఇల్లు గుల్ల చేసేస్తారు.. సెల్‌ఫోన్ వాడరు, సిగ్నల్ దొరకనివ్వరు, తమ మొహాలు కనపడనివ్వరు..
పల్నాడు జిల్లాలో కీలక నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.. చిలకలూరిపేటలో ఇద్దరు మాజీ మంత్రులు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు... తనది పురుషోత్తమ పట్నం అని, తనపై అక్రమ కేసులు పెడితే ఏం జరుగుతుందో చూస్తారు అంటూ మాజీ మంత్రి విడదల రజని హెచ్చరించారు... నాకే కాదు కుటుంబం, ప్రత్తిపాటి పుల్లారావుకు కూడా కుటుంబం ఉంటుందని, తాను మరో 30 ఏళ్లు చిలకలూరిపేట రాజకీయాల్లోనే ఉంటానని, నేను అధికారంలోకి వస్తే, రాజకీయాల నుండి రిటైర్డ్ అయినా…
దేశ ప్రజలు ఎన్డీయేపై పూర్తి విశ్వాసం చూపిస్తున్నారు.. చాలా రాష్ట్రాల్లో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది.. నిజమైన అభివృద్ధిని ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో చూడొచ్చు అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని పురస్కరించుకుని.. బీజేపీ కేంద్ర కార్యాలయం దగ్గర నిర్వహించిన విజయోత్సవాల్లో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఎన్డీఏ కూటమిలోని సీఎంల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు.. బీహార్‌లో నితీష్ కుమార్, ఏపీలో చంద్రబాబుతో కలిసి ఘన విజయం సాధించామన్ నమోడీ.. ఏపీలో చంద్రబాబు…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఏపీకి, ఢిల్లీకి దగ్గరి పోలికలు ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. లిక్కర్ పేరుతో సిస్టమ్ సర్వ నాశనం చేశారని మండిపడ్డారు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం స్కాంతో పోల్చుకుంటే, ఢిల్లీలో జరిగిన స్కాం చాలా చిన్నది. మద్యం కుంభకోణంలో వచ్చే డబ్బు, పాపిష్టి డబ్బు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి, వేల కోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు..