Student Kidnapped: కాకినాడ జిల్లాలోని తునిలో పరమేశ్ అనే బాలుడి కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. భాష్యం స్కూల్ లో ఒకటవ తరగతి చదువుతున్న బాలుడుని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుని వెళ్లారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు బాబుకి టానిక్ పట్టించాలని చెప్పి.. పాఠశాల నుంచి బయటకు తీసుకొచ్చారు సదరు దుండగులు.
AP Assembly: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలు అవుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఓటాన్ అకౌండ్ బడ్జెట్ ను గత ఏడాది జూలైలో చంద్రబాబు సర్కార్ ప్రవేశ పెట్టింది. ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరం 2025 - 26కి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి అసెంబ్లీ సమావేశాల గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది.
ఈ నెల 12వ తేదీ నుంచి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన ప్రారంభంకానుంది.. ఈ పర్యటనలో మూడు రోజులు వివిధ దేవాలయాలను సందర్శించనున్నారు పవన్ కల్యాణ్.. ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పవన్ ఆలయాల సందర్శన కొనసాగనుంది.. ఈ ఆధ్యాత్మిక యాత్రలో.. అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుసరామస్వామి, అగస్థ్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలను పవన్ కల్యాణ్…
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఘటనపై స్పందించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ దాడి దురదృష్టకరమన్న ఆయన.. ఒక వ్యక్తిపై కాదు.. ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలన్నారు.. చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. దురదృష్టకరమైన ఘటన ఇది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.
పోలీసులపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం గుంతపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై కత్తితో దాడి సందర్భంగా.. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఘాటైన విమర్శలు చేశాడు. రాప్తాడులో ప్రశ్నించినవారిపై దాడులు చేస్తున్న పరిటాల కుటుంబానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. పోలీసులకు సిగ్గుండాలని, పోలీసులు పరిటాల కుటుంబం గుమస్తాలు, వాచ్మెన్లు కాదని విమర్శించారు.
అనారోగ్య కారణాలతో.. గుంటూరులో సీఐడీ విచారణకు వర్మ హాజరు కాలేరని ఆయన తరపు న్యాయవాది నాని బాబు.. సీఐడీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.. నేడు గుంటూరులో సీఐడీ కార్యాలయానికి వెళ్లిన వర్మ తరపు అడ్వకేట్.. సీఐడీ విచారణకు రావడానికి రామ్ గోపాల్ వర్మ కు 8 వారాల సమయం కావాలని కోరారు..
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి సిద్ధమయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది.. 229, 230వ బ్యాంకర్ల సమావేశాలను ఒకేసారి నిర్వహిస్తున్నారు.
విశాఖ కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు అధికారికంగా కేంద్రం ఆమోదించడంతో పాటు రూట్ మ్యాప్ పిక్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం జోన్ పరిధిలోకి తెస్తూనే కీలకమైన కేకే లైన్ ను తూర్పు కోస్తా పరిధిలో నూతనంగా ఏర్పాటైన రాయగడ డివిజన్ పరిధిలోకి మార్పు చేసింది. కొత్తవలస - కిరండోల్ భాగమైన అరకు రైల్వే స్టేషన్ పై తెలుగువారికి ఎంతో ఎమోషనల్ టచ్ ఉన్నది. అంతే కాదు కేకే లైన్ తూర్పు కోస్తా రైల్వే…
పోలవరం ప్రాజెక్టుపై నేడు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కీలక సమీక్ష నిర్వహించనుంది.. పోలరవం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ పనుల్లో కీలకమైన సమాంతర డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం అంతర్జాతీయ నిపుణుల ప్యానెల ఇచ్చిన సూచనల మేరకు ప్లాస్టిక్ కాంక్రీట్ టీ -16 మిశ్రమాన్ని కాంట్రాక్టు సంస్థ బావర్ వాడుతోంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఈ ఏడాది ఆఖరుకు పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి లక్ష్యాన్ని నిర్దేశించింది.