IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!
- తుది అంకానికి చేరిన టీ20 వరల్డ్ కప్ 2026
- మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ ఢీ
- భారత జట్టులో కీలక మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India playing 11 vs England for T20 World Cup 2026 Semi Final: టీ20 వరల్డ్ కప్ 2026 తుది అంకానికి చేరింది. బుధవారం (మార్చి 4) నుంచి సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 4న జరిగే మొదటి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్ తలపడనున్నాయి. మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ ఢీకొట్టనున్నాయి. రెండో సెమీస్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. ఈ నాకౌట్ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్ చేరాలని రెండు టీమ్స్ చూస్తున్నాయి. భారత్, ఇంగ్లాండ్ పటిష్టంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. సెమీఫైనల్‌కు భారత తుది జట్టులో ఓ కీలక మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్ కోసం మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుని.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండటంతో మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే బౌలర్ అవసరమని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. కుల్దీప్ తన చైనామన్ బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సామర్థ్యం కలిగిన ఆటగాడు. కీలక మ్యాచ్‌ల్లో అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని మేనేజ్‌మెంట్ బావిస్తోంది. వరుణ్ కూడా మిస్టరీ స్పిన్నర్‌గా గుర్తింపు పొందినప్పటికీ.. ఇటీవల మ్యాచ్‌ల్లో అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడమే ఈ మార్పుకు కారణమని సమాచారం.
Also Read
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read: Shivam Dube The Finisher: శివమ్ దూబే.. ‘ది టీమిండియా ఫినిషర్’!
ఫైనల్‌కు చేరాలంటే భారత్, ఇంగ్లాండ్ జట్లు అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో చిన్న మార్పు కూడా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపవచ్చు. టీమిండియా చివరి నిమిషంలో ప్లేయింగ్ ఎలెవన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కుల్దీప్ యాదవ్‌కు అవకాశం దక్కితే.. స్పిన్ విభాగంలో భారత్‌కు మరింత బలం చేకూరే అవకాశం ఉంది. అభిమానులు ఈ కీలక మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఒక్క మార్పు మినహా జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. వెస్టిండీస్‌పై మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన సంజు శాంసన్ ఓపెనర్‌గా కొనసాగనున్నాడు. ఇషాన్, సూర్య, తిలక్, హార్దిక్, దూబేలు రన్స్ చేస్తుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. అభిషేక్ శర్మ ఒక్కడు రాణిస్తే తిరుగుండదు. బౌలింగ్‌లో బుమ్రా రాణిస్తున్నా.. మిగతా వారు రన్స్ కట్టడి చేస్తే భారత్ ఫైనల్ చేరే అవకాశాలు ఉంటాయి.
భారత్ జట్టు (అంచనా):
సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!