Vallabhaneni Vamsi Case: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వల్లభనేని వంశీకి సంబంధించిన పలు పిటిషన్ల మీద బెజవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ జరిపింది. వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయటంతో విచారణ జరిపారు. ఇంటి భోజనం, జైలులో సౌకర్యాలు కల్పించాలని దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపారు. కేసుకు సంబంధించి వంశీ కోర్టులో సెల్ఫ్ అఫిడవిట్ కూడా కోర్టులో దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై విచారణ గురువారానికి వాయిదా పడింది. మరోవైపు వల్లభనేని వంశీ పిటిషన్ పై రేపు తీర్పు వెలువరించనుంది ఏపీ హైకోర్టు..
Read Also: Odela 2: మహా కుంభమేళాలో ‘ఓదెల 2’ టీజర్ లాంఛ్
వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ పై ఎస్సీ, ఎస్టీ కోర్టులో వాదనలు జరిగాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ కుట్రలో ఇతరుల పాత్ర తెలుసుకోవటం కోసం, నిందితులు వినియోగించిన బ్లాక్ క్రెటా కారును గుర్తించటం, వంశీ ఫోన్ సీజ్ చేయటం కోసం కస్టడీకి ఇవ్వాలని ప్రభుత్వం వాదనలు వినిపించింది. సత్యవర్ధన్ పోలీసుల అదుపులో ఉన్నాడని, అతనే అన్ని వివరాలు చెబుతాడు కాబట్టి వంశీ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు వంశీ తరపున న్యాయవాదులు. ఇక వంశీ కూడా కోర్టులో సెల్ఫ్ అఫిడవిట్ ను దాఖలు చేశారు. సత్యవర్ధన్ కేసుతో తనకు సంబంధంలేదని, పోలీసులకు ఈ కేసు గురించి చెప్పటానికి తన దగ్గర ఏం లేదని అఫిడవిట్ ఇచ్చారు వంశీ. సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు అనే విషయాలను సీన్ రీ కన్ స్ట్రక్షన్ కూడా అతనితో చేసుకోవచ్చని వంశీ అఫిడవిట్ లో తెలిపారు. ఇక వంశీకి భోజనం, జైల్లో సదుపాయాల కల్పించాలని పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయమూర్తి జైల్లో పరిస్థితులపై వంశీ నుంచి లెటర్ రూపంలో వివరాలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.
Read Also: South Central Railway: చర్లపల్లి టర్మినల్ నుంచి ధానాపూర్ కు ప్రత్యేక రైళ్లు
మరోవైపు, వంశీకి బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయటానికి న్యాయస్థానానికి సమయం కోరింది. బెయిల్ పిటిషన్ పై వాదనలు జరపటానికి ప్రత్యేక పీపీని నియమిస్తున్న కారణంగా కౌంటర్ దాఖలు చేయటం కోసం సమయం కోరటంతో రెండు రోజులు సమయం ఇస్తూ న్యాయమూర్తి వాయిదా వేశారు. కస్టడీ పిటిషన్ లో వంశీ తరపున మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అరెస్టు సమయంలో వంశీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే మాత్రమే సీజ్ చేయాలని, అరెస్ట్ సమయంలో సెల్ ఫోన్ లేకపోతే అవసరం లేదని సుప్రీం కోర్టు తీర్పు ఉందన్నారు. కేసులో కీలకంగా ఉన్న సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉంటే ఇంకా వంశీ కస్టడీతో అవసరం లేదన్నారు పొన్నవోలు. ఇక, వల్లభనేని వంశీ పిటిషన్ పై రేపు తీర్పు వెలువరించనుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు వంశీ.. ఇప్పటికే విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసింది న్యాయస్థానం.. రేపు ఈ పిటిషన్ పై తీర్పు ఇవ్వనుంది ఏపీ హైకోర్టు..