Off The Record: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని రంజాన్ ఇరుకున పడేసిందా..?
- ముస్లిం ఉద్యోగులకు ఇరు ప్రభుత్వాల వెసులుబాట్లు..
- రంజాన్ మాసంలో గంట ముందే వెళ్ళేందుకు అనుమతి..
- మార్చి రెండు నుంచి నెలాఖరు వరకు వెసులుబాటు..
- తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్న బీజేపీ లీడర్స్..
- హిందూ మాలధారులకు ఆ వెసులుబాట్లు ఎందుకివ్వరని క్వశ్చన్..
- తెలంగాణ సర్కార్ మీద బండి సంజయ్, రాజాసింగ్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణలో కొత్త రాజకీయ రగడ మొదలైంది. కాకుంటే… ఇది మత పరంగా సున్నితమైన అంశం కావడంతో… జాగ్రత్తగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఇదే సమయంలో బీజేపీ డబుల్ స్టాండర్డ్స్ అనుసరిస్తోందన్న చర్చ సైతం మొదలైంది. త్వరలో రంజాన్ మాసం మొదలవబోతోంది. ఈ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాయి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు. ఆఫీస్ సాధారణ సమయం కంటే ఒక గంట ముందే… అంటే సాయంత్రం నాలుగు గంటలకే ముస్లిం ఉద్యోగులంతా విధులు ముగించుకుని వెళ్ళిపోవచ్చు. మార్చి రెండు నుంచి ఆ నెలాఖరు వరకు ఈ వెసులు బాటు ఉంటుంది. ఈ ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు సాయంత్రం 4 గంటలకే విధులను ముగించుకుని వెళ్ళిపోవచ్చు. అయితే… తెలంగాణలోఈ వెసులుబాటునే తప్పు పడుతున్నాయి బీజేపీ వర్గాలు. టీజీ బీజేపీ సీనియర్ లీడర్స్ అయితే.. ఓ అడుగు ముందుకేసి ఈ వెసులుబాటుకు, అయ్యప్ప, భవానీ, హనుమాన్ మాలధారులకు ముడిపెట్టి మాట్లాడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే వెసులుబాట్లు కేవలం రంజాన్‌కేనా? ఇతర మాలధారులకు ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. అలాగే, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ, రంజాన్ పండుగ కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవో సరైంది కాదని అన్నారు. దేవీ నవరాత్రుల సమయంలో హిందూ ఉద్యోగులకు ఇలాంటి వెసులుబాటు ఎందుకు ఇవ్వరన్నది ఆయన క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వానికి ఒక మతం పండగే కనిపిస్తుందా అని కూడా ప్రశ్నించారు రాజాసింగ్. వాళ్ళ ప్రశ్నలు, ఉద్దేశ్యాలు ఎలా ఉన్నా… అసలు రాజకీయం ఇక్కడే మొదలైంది. బీజేపీ వైఖరిని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. తెలంగాణలో పొలిటికల్‌గా ఏదో చేసేయాలన్న ఉద్దేశ్యంతోనే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారన్నది కాంగ్రెస్ అభిప్రాయం. అదే సమయంలో వేళ్ళు ఏపీ వైపు చూపిస్తున్నారు హస్తం పార్టీ లీడర్స్. ఆంధ్రప్రదేశ్‌లో మీరు భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం కూడా వెసులుబాటు సర్క్యులర్ ఇచ్చింది కదా… మరి అక్కడెందుకు ప్రశ్నించరన్నది కాంగ్రెస్ క్వశ్చన్. ఏపీలో తమ ప్రభుత్వాన్ని వదిలేసి… తెలంగాణలో అదే తరహా వెసులుబాట్లు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్‌ని విమర్శించడం ద్వంద్వ నీతి కాక ఇంకేంటని అడుగుతున్నారట టీజీ కాంగ్రెస్ నాయకులు.
Also Read
మీకు నిజంగానే అభ్యంతరాలుంటే…. ఏపీలో ఉన్న మీ ప్రభుత్వానికి చెప్పండి… ఇక్కడ అనవసర రాజకీయాలు చేసి మతపరమైన ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టవద్దని బీజేపీ నాయకులకు స్ట్రాంగ్‌గా చెబుతున్నారట కాంగ్రెస్ లీడర్స్. అంతలా అభ్యంతరాలుంటే… ఏపీ బీజేపీ లీడర్స్ కూడా మాట్లాడాలికదా…. ప్రభుత్వంలో ఉండి కూడా అక్కడ కామైపోయి తెలంగాణలో మాత్రం మాట్లాడ్డం ఏంటన్నది కాంగ్రెస్ క్వశ్చన్‌గా తెలుస్తోంది. ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!