Mohammad Amir: ఛీ.. మీ వక్ర బుద్ది మారదా? భారత్ పై నోరుపారేసుకున్న పాకిస్తాన్ ప్లేయర్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Amir: పాకిస్తాన్ ఆటగాళ్లకు వారి జట్టు సంగంతి పట్టించుకుంటారో లేదో కానీ.. అంతకంటే ఎక్కువగా భారత జట్టుపై విమర్శలు చేయడానికి రెడీ ఐపోతుంటారు. టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ఆటపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. “భారత్ సెమీఫైనల్‌కు చేరుకోదని” అమీర్ గతంలో చేసిన జోస్యం తప్పడంతో నెటిజన్లు అతడిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పాకిస్థానీ టీవీ షో ‘హార్నా మనా హై’ (Haarna Mana Hai) లో పాల్గొన్న అమీర్, భారత్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రూ. 4,000 డిస్కౌంట్‌తో పాటు ఉచిత ఇయర్‌బడ్స్.. నేటి నుంచి iQOO 15R సేల్ షురూ..!
Also Read
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
సూపర్ 8లో దక్షిణాఫ్రికాతో ఓటమి తర్వాత భారత్ సెమీస్ చేరదని అమీర్ మాట్లాడిన సంగతి తెలిసిందే. కానీ జింబాబ్వే, వెస్టిండీస్‌లపై వరుస విజయాలతో భారత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. దీనిపై అమీర్ స్పందిస్తూ.. క్రికెట్ పరంగా చూస్తే భారత్ ఇంకా మంచి క్రికెట్ ఆడటం లేదని అన్నాడు. ముఖ్యంగా భారత్ ఫీల్డింగ్ ఏమాత్రం బాగోలేదని, మ్యాచ్ లో 3 క్యాచ్‌లు వదిలేయడమే కాకుండా ఫీల్డింగ్‌లో కూడా తడబడ్డారని పేర్కొన్నాడు. ఇంకా జస్ప్రీత్ బుమ్రా మినహా మిగిలిన బౌలర్లందరూ భారీగా పరుగులు ఇచ్చుకున్నారని విమర్శించాడు.
ఇంకా అమీర్ మాట్లాడుతూ.. పెద్ద జట్లపై హార్దిక్ పాండ్యా ఎప్పుడూ రాణించడని, విండీస్‌తో మ్యాచ్ లో 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చాడని అమీర్ అన్నాడు. ఇక మిస్టరీ స్పిన్నర్ గా పేరొందిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌ను వెస్టిండీస్ సమర్థవంతంగా ఎదుర్కొందని, సెమీఫైనల్ చేరిన జట్లు స్పిన్నర్లను బాగా ఆడగలవని.. అందుకే భారత్ ఇంకా ఈ టోర్నీలో భారత్ ఫేవరెట్ కాదని అభిప్రాయపడ్డాడు.
Shivam Dube The Finisher: శివమ్ దూబే.. ‘ది టీమిండియా ఫినిషర్’!
ఇక వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో షిమ్రాన్ హెట్ మేయర్ అవుట్ కావడంపై అమీర్ ఒక ‘కాంట్రవర్సీ’ని తెరపైకి తెచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లో సంజూ శాంసన్ క్యాచ్ పట్టగా.. అంపైర్ అవుట్ ఇచ్చాడు. రివ్యూలో బంతి బ్యాట్‌కు తగిలినట్లు కనిపించినా హెట్ మేయర్ అసంతృప్తి చెందాడు. దీనిపై అమీర్ మాట్లాడుతూ.. “నా దృష్టిలో హెట్ మేయర్ అవుట్ కాదు. అది ఓ వివాదాస్పద నిర్ణయం. ఒకవేళ అతను మరికొంత సేపు క్రీజులో ఉండి ఉంటే వెస్టిండీస్ స్కోరు 220-230కి చేరి ఉంటే.. ఈ సమయానికి భారత్ టోర్నీ నుండి నిష్క్రమించేది” అని వ్యాఖ్యానించాడు. ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా గురువారం జరగనున్న సెమీఫైనల్ పోరులో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి.
తాజావార్తలు
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!