బీజేపీ ఘన విజయంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ విజయం చారిత్రాత్మకం.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత దేశం అని చెప్పుకోవడం గర్వంగా ఉంది అన్నారు.. ఢిల్లీలో వాయు కాలుష్యం.. రాజకీయ కాలుష్యం ఎక్కువగా ఉంది.. ఒక్కోసారి పరిస్థితి తారుమారు అవుతుంది.. ఇందుకు ఉదాహరణ ఢిల్లీ అన్నారు.. ప్రధాని నరేంద్ర మోడీపై నమ్మకంతోనే ఢిల్లీ విజయం సాధ్యం అయ్యిందన్నారు.. ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రజలు బలపరిచారని పేర్కొనర్నారు..
వర్మ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా మరో ట్వీట్ చేశారు.. ఒంగోలు పోలీస్ స్టేషన్ లో నిన్న విచారణ పూర్తయిన అనంతరం ఎక్స్ లో స్పందించిన ఆర్జీవీ.. ''ఐ లవ్ ఒంగోలు.. ఐ లవ్ ఒంగోలు పోలీస్.. ఈవెన్ మోర్.. 3 ఛీర్స్...'' అంటూ రాసుకొచ్చిన వర్మ.. పెగ్గుతో ఉన్న తన ఫొటోను పోస్ట్ చేశారు..
ఢిల్లీలో బీజేపీ విజయంపై స్పందించిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విశ్వాసం మరోమారు రుజువైందన్నారు.. 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా నరేంద్ర మోడీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారు. సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారు. నరేంద్ర మోడీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో దేశ రాజధాని ఢిల్లీ పాత్ర అత్యంత కీలకంగా పేర్కొన్నారు..
ఏపీ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, రుణాలు అందించి వారికి అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిలో భాగంగానే ఈ నెల 10వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగనున్నది. 229, 230 వ బ్యాంకర్ల సమావేశాలను ఒకేసారి నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా గత ఏడాది అక్టోబరు 17 తేదీన ఎస్ఎల్ బీసీ సమావేశం జరిగింది. ఎల్లుండి జరగబోయే సమావేశంలో వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్…
గుంటూరు జిల్లాలోని, కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో టిడిఆర్ బాండ్ ల పేరుతో భారీ అక్రమాలు జరిగాయని విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. 10 కోట్ల రూపాయల అక్రమాలు బయటపడ్డాయని తెలిపారు. రోడ్ల విస్తరణ పేరుతో, ఈ టిడిఆర్ బాండ్ల అక్రమాలు జరిగాయని, విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. కొన్ని చోట్ల రోడ్ డెవలప్మెంట్ ప్లానింగ్ లేకుండానే, టిడిఆర్ బాండ్లు విడుదల చేశారని, డోర్ నెంబర్లు మార్చి, తక్కువ ధర పలికే స్థలానికి కూడా ఎక్కువ దరలకు టీడీఆర్ బాండ్లు ఇచ్చారని, విజిలెన్స్…
మరో కేసులో ఏపీ సీఐడీ పోలీసుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది వర్మ.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మకి నోటీసు జారీ చేశారు గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు. ఈ నెల 10వ తేదీన గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకి హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు..
ఏపీ బీజేపీలో కొత్త ఆశలు రేగుతున్నాయి. త్వరలో ఖాళీ అవబోతున్న ఎమ్మెల్సీ సీట్ల కోసం నాయకులు చాపకింద నీరులా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారట.వచ్చే మార్చిలో ఎమ్మెల్యే కోటాలో నాలుగు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవబోతున్నాయి. అందులో ఒకటి బీజేపీకి ఇచ్చే ఛాన్స్ ఉందన్న అంచనాతో... రాష్ట్ర పార్టీ సీనియర్స్ పావులు కదుపుతున్నట్టు సమాచారం.
మంచిని మైకులో చెప్పు, చెడును చెవిలో చెప్పు అంటారు. కానీ.... ఏపీలో మాత్రం మంచో చెడో తెలియదుగానీ.... మొత్తం మైకులో చెప్పేశారు. ఇప్పుడిదే రాష్ట్రంలో చర్చోప చర్చలకు కారణం అవుతోంది. తనతో సహా... మంత్రివర్గ సహచరులందరికీ ర్యాంక్స్ ఇచ్చేశారు సీఎం చంద్రబాబు. వాటి చుట్టూనే ఇప్పుడు కొత్త ప్రశ్నలు, అనుమానాలు రేగుతున్నాయట. సాధారణంగా చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటే... ర్యాంకులు...గ్రేడ్లు....అంటూ రకరకాల తూనికలు-కొలతలు ఉంటాయి.