రూ. 4,000 డిస్కౌంట్‌తో పాటు ఉచిత ఇయర్‌బడ్స్.. నేటి నుంచి iQOO 15R సేల్ షురూ..!
- ఐక్యూ 15R భారత మార్కెట్లో అధికారికంగా సేల్ ప్రారంభం.
- 6.59 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్.
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్
- 6.5K IceCore VC కూలింగ్ సిస్టమ్‌తో దీర్ఘకాల గేమింగ్ సపోర్ట్.
- 50MP Sony ప్రైమరీ కెమెరా (OIS), 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 32MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా.
- 7600mAh భారీ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
- ప్రారంభ ధర రూ. 44,999 (8GB + 256GB)..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO 15R Sale: భారత మార్కెట్లో ఐక్యూ (iQOO) తన తాజా మిడ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఐక్యూ 15R (iQOO 15R)ను లాంచ్ చేసింది. ఇందులో 144Hz AMOLED డిస్‌ప్లే, 7600mAh భారీ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ గేమింగ్, హెవీ యూజర్లను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చింది. ఇందులో 6.59 అంగుళాల 1.5K (1260×2750 పిక్సెల్స్) AMOLED స్క్రీన్‌ను అందించారు. 144Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్, గేమింగ్ మరియు వీడియో ప్లేబ్యాక్ చాలా స్మూత్‌గా అనుభవించవచ్చు.
144Hz డిస్‌ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!
Also Read
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
- 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
పనితీరు పరంగా ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ను అమర్చారు. ఇది హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్, హై పర్ఫార్మెన్స్ అవసరాలకు అనుకూలంగా ఉంటుంది. 8GB/12GB ర్యామ్ వేరియంట్లతో పాటు 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. దీర్ఘకాల గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో 6.5K IceCore VC కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. ఈ డివైస్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పై నడుస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50MP Sony LYT-700V ప్రైమరీ సెన్సార్ OIS సపోర్ట్‌తో ఉంటుంది. ఇది లో-లైట్ ఫోటోగ్రఫీ, స్టేబుల్ వీడియోలకు సహాయపడుతుంది. 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ విస్తృత దృశ్యాలను క్యాప్చర్ చేయడానికి ఉపయోగపడుతుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరా అందుబాటులో ఉంది. ఇక ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ 7600mAh భారీ బ్యాటరీ. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వల్ల తక్కువ సమయంలోనే బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు.
Shivam Dube The Finisher: శివమ్ దూబే.. ‘ది టీమిండియా ఫినిషర్’!
భారత మార్కెట్లో ఐక్యూ 15R ధర 8GB + 256GB వేరియంట్‌కు రూ. 44,999గా నిర్ణయించారు. 12GB + 256GB వేరియంట్ ధర రూ. 47,999 కాగా, 12GB + 512GB వేరియంట్ ధర రూ. 52,999గా ఉంది. లాంచ్ ఆఫర్‌గా HDFC & Axis బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ. 1,899 విలువైన iQOO/Vivo TWS ఇయర్‌బడ్స్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఫోన్ డార్క్ నైట్, ట్రయంఫ్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది.
The wait is over. Sale starts today at 12 Noon.
iQOO 15R is officially up for grabs, from next-level speed to marathon battery life and ultra-smooth gaming, this is performance that refuses to hold back.
Starting at ₹40,999.*
Swipe through. Pick your reason. Make it yours.… pic.twitter.com/q9xptOcwcm
— iQOO India (@IqooInd) March 3, 2026
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!