Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో 55 మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుంచి తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం.. లోకాయుక్త ఆదేశాలతో విధులకు డుమ్మా కొట్టిన వైద్యులను విధుల నుంచి టెర్మినేట్ చేసింది ఏపీ ప్రభుత్వం.. చర్యలు తీసుకున్నట్టు లోకాయుక్తకు నివేదిక పంపించింది ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ.. తొలగింపునకు గురైన వైద్యుల్లో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు.. అయితే, కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్.. ప్రభుత్వ వైద్యుల వ్యవహారశైలిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.. ఎలాంటి అనుమతి, సెలవు లేకుండా ఏడాదికి పైగా వైద్యులు గైర్హాజరవుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.. వైద్యులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని లోకాయుక్తకు తన ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న లోకాయుక్త.. ఎలాంటి అనుమతి లేకుండా.. సెలవు కూడా పెట్టకుండా.. సుదీర్ఘకాలం పాటు విధులకు హాజరుకాని ఆ వైద్యులను తొలగించాలని స్పష్టం చేసింది.. ఇక, లోకాయుక్త ఆదేశాలతో 55 మంది వైద్యుల టెర్మినేట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
Read Also: CM Chandrababu: వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. ఇది సబబేనా..?