CM Chandrababu: అధైర్య పడొద్దు.. మిర్చి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లాం.. రైతులని ఆదుకోవాలని కేంద్ర మంత్రిని కలిసి చెప్పాను. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్రమంత్రి దృష్టికి తెచ్చాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25 శాతం మాత్రమే ఇస్తారు. అది కూడా ఐసీఏఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఏపీలోని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా ధర నిర్ణయిస్తున్నారు. సాగు ఖర్చులను రియలిస్టిక్ గా లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలి. అవన్నీ సరిచేయాలని కేంద్రమంత్రిని కోరినట్టు వెల్లడించారు.. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి కూడా ఆలోచిస్తాం అన్నారు సీఎం చంద్రబాబు..
Read Also: Andhra Pradesh: లోకాయుక్త ఆదేశాలు.. 55 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు..
ఏపీలో మిర్చి రైతులను ఆదుకుంటాం.. రైతులు ఎవరు అధైర్య పడొద్దు.. ఒక్కోసారి ధరలు తగ్గుతుంటాయు, పెరుగుతుంటాయి అన్నారు చంద్రబాబు.. ఏపీలో మిరప ఎక్కువ పండిస్తారు. దేశంలో పండే మిరప పంటలో 50 శాతం ఏపీ నుంచే దిగుబడి ఉంటుంది. ఈ సంవత్సరం 12 లక్షల మెట్రిక్ టన్నులు మిర్చి కొనుగోలు చేయాలి. ఇప్పటికే నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల పంట మార్కెట్ లోకి వచ్చింది. సుమారు 5 లక్షల ఎకరాల్లో మిర్చి పంట వేస్తున్నారు. ఈ సంవత్సరం రైతు నష్టపోయే పరిస్థితి వచ్చింది. గత ఏడాది అంతర్జాతీయంగా మార్కెట్ బాగుండడంతో, మిర్చి రైతులు పెద్ద ఎత్తున ఏపిలో సాగు చేశారు.. అనూహ్యంగా విదేశాల్లో డిమాండ్ తగ్గటంతో రైతు నష్టపోయే పరిస్థితి వచ్చిందని.. ఈ పరిస్థితుల్లో మిర్చి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ఉందని కేంద్ర మంత్రికి చెప్పాను అన్నారు చంద్రబాబు..
Read Also: Single Boy Story: “బాబు పెళ్లెప్పుడూ..” 30 ఏళ్లు దాటినా పెళ్లి అవ్వక యువకుల బాధలు వర్ణనాతీతం..
అంతేకాదు.. ఏ రకంగా మిర్చి రైతులను ఆదుకోవాలో సూచించాం. రేపు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి, తిరిగి మాకు చెప్తా అన్నారు.. రైతులకు ఖచ్చితంగా మేలు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఎం.. ఏదేమైనా రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎగుమతులు ప్రోత్సహించే దానిపైన కూడా ఆలోచిస్తాను. కేంద్రం, రాష్ట్రం ప్రయత్నాలు చేస్తున్నాయు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఇప్పటికే మూడు లేఖలు రాసిన కేంద్రానికి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాను. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి రేపు ఢిల్లీ వచ్చి అధికారులతో మాట్లాదాకా స్పష్టత వస్తుందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..