Security Failure in YS Jagan Tour: కేంద్ర బలగాలతో జగన్‌కు రక్షణ కల్పించండి.. ప్రధాని మోడీ, అమిత్‌షాకు వైసీపీ లేఖ
- వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో భద్రతా వైఫల్యం..
- ప్రధాని మోడీ, అమిత్ షాకు మిథున్ రెడ్డి లేఖ..
- జగన్ కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి..
- జగన్ రక్షణలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Security Failure in YS Jagan Tour: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనలో అడుగడునా భద్రతా వైఫ్యలం స్పష్టంగా కనిపించిందని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.. అయితే, దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు వైయస్సార్సీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.. జగన్ కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్లిన జగన్‌కు పోలీసులు రక్షణ కల్పించలేదని దుయ్యబట్టారు.. జగన్ పర్యటనలు తీవ్రమైన భద్రత వైఫల్యం తలెత్తింది.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి అని విజ్ఞప్తి చేశారు..
Read Also: UP: శివరాత్రికి ముందు… తవ్వకాల్లో బయటపడ్డ శివలింగం
Also Read
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ఇటీవల వైఎస్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయి అని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షా దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లారు మిథున్‌రెడ్డి.. ఇవి భారీ ఎత్తున పన్నిన కుట్రలో భాగంగా జరుగుతున్న ఘటనలుగా ఆరోపించారు.. వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా భద్రత వైఫల్యం కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.. కూటమి ప్రభుత్వం విధానాల వల్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు.. ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడిచేలా ప్రమాదకర ధోరణికి తెరలేపుతోందని కూటమి ప్రభుత్వం అంటూ.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు వైసీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి. కాగా, ఇప్పటికే ఏపీ గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతలు.. వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో తగిన భద్రత కల్పించలేదని ఫిర్యాదు చేసిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!