Minister Narayana: ఏపీ మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ముంబైలో పర్యటిస్తున్నారు.. మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఇతర అధికారులు.. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA), సిడ్కో అధికారులతో సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో MMRDA ప్లానింగ్ డైరెక్టర్ శంకర్ దేశ్ పాండే, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.. అయితే, ముంబై అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది MMRDA.. ముంబైలో రోడ్లు, మెట్రో రైలు, హౌసింగ్ ప్రాజెక్టులను MMRDA చేపడుతోంది.. రోడ్లు అభివృద్ధి, మెట్రో రైలు ప్లానింగ్, రవాణా ప్రణాళికలు, ఇళ్ల నిర్మాణం, రీజినల్ డెవలప్మెంట్, నిధుల సమీకరణపై మంత్రి నారాయణ బృందానికి వివరించారు ముంబై అధికారులు.. ముంబై మహానగరంలో విదేశీ పెట్టుబడుల సహకారంతో మౌళిక వసతులను అభివృద్ధి చేస్తున్న విధానాన్ని మంత్రికి వివరించారు MMRDA అధికారులు.. ఇక, ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణ చేస్తున్న విధానాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి నారాయణ.. ముంబై మహానగర అభివృద్ధిలో MMRDA తీసుకుంటున్న విధానాలను ఏపీలోని నగరాల అభివృద్ధికి అనుసరించే ఆలోచనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా తెలుస్తుండగా.. అందులో భాగంగానే మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు.. ముంబైలో పర్యటిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Read Also: Rashmika: ఆ పనిలో బిజీగా రష్మిక