ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎస్కార్ వాహనం గన్‌మెన్ జీవీ రమణపై సస్పెన్షన్ వేటు పడింది.. రమణ డ్యూటీ దిగి ఇంటికి వెళ్తుండగా బ్యాగ్ మాయమైంది. అందులో 30 బుల్లెట్లతో గన్ మ్యాగ్జైన్ ఉండటం పోలీసు శాఖలో కలకలం రేపింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి గాను రమణను విధుల నుంచి సస్పెండ్ చేశారు పార్వతీపురం జిల్లా ఎస్పీ..
ప్రేమికుల దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్‌లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదంటూ ఓ యువతిపై యాసిడ్ దాడి చేశాడు ప్రియుడు. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.. జిల్లాలోని గుర్రంకొండ మండలం ప్యారంపల్లికి చెందిన జనార్దన్, రెడ్డెమ్మ దంపతుల కుమార్తె గౌతమి (23) పై మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ యాసిడ్ తో దాడి చేశాడు.
మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదని కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కడప నగరంలో చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఇమ్రాన్ డబ్బులు ఇవ్వాలంటూ తన భార్య జమీలను ఒత్తిడి చేశాడని అయితే 300 రూపాయలు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంకా ఇవ్వాలంటూ ఆమెను హింసించాడని, డబ్బులు ఇవ్వడానికి జమీల నిరాకరించడంతో ఆగ్రహంతో సుత్తితో ఆమెను అత్యంత దారుణంగా కొట్టి చంపినట్లు వారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకునేలా డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ను తీసుకొచ్చారు.
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వంశీ భార్య పంకజ శ్రీ.. వంశీ అరెస్ట్ సక్రమంగా జరగలేదన్న ఆమె.. రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నాయనే తెలుస్తోంది.. అరెస్ట్ అక్రమం అనేది కూడా స్పష్టం అవుతోందన్నారు.. ఇక, తనకు ప్రాణహాని ఉందనే విషయాన్ని మెజిస్ట్రేట్‌కి వంశీ తెలిపారని గుర్తుచేశారు.. పోలీస్‌స్టేషన్‌లో వంశీ పట్ల పోలీసులు తప్పుగా ప్రవర్తించారు.. నా భర్త అరెస్ట్‌పై న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు వల్లభనేని వంశీ…
వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు పోలీసులు. సత్యవర్ధన్‌ను బెదిరించడంలో వంశీదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. మరణ భయంతోనే వంశీ అనుచరులు చెప్పినట్లు సత్యవర్ధన్ చేశాడని గుర్తించినట్లు ప్రస్తావించారు. వంశీకి చట్టాలపై గౌరవం లేదని, అతనికి నేర చరిత్ర ఉందని, ఇప్పటి వరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. వంశీని పట్టుకునేందుకు ఎన్టీఆర్ జిల్లా సీపీ ఆదేశాలతో 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, విశాఖ…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ రిమాండ్ విధించింది కోర్టు. వంశీతో పాటు కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌కు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో విజయవాడ సబ్ జైలుకు తరలించారు.