GBS Virus In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 17 గులియన్ బర్రె సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు నమోదు అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఆరు జిల్లాల్లో ఈ జీబీఎస్ కేసులు నమోదు అయినట్టు గుర్తించారు.
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక, పోలీసుల పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది.
CM Chandrababu: స్వచ్చాంధ్ర, స్వచ్ దివాన్ పై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. జనవరి నెలలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే అంశాన్ని థీమ్ గా తీసుకోగా.. ఈ నెలలో సోర్స్ రీ సోర్స్ అనే అంశాన్ని థీమ్ గా తీసుకోవాలన్నారు. మన మూలాలు - మన బలాలు తెలుసుకునేలా.. రాష్ట్రంలోని వనరులను ఎలా సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలనే దానిపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు.
అక్రమ కేసులు, కక్షసాధింపు రాజకీయాలు, అధికార దుర్వినియోగం వైసీపీకే సాధ్యం అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆరోపించారు. పగటిపూట రాంబాబు, రాత్రులు కాంబాబు అయిన అంబటికి డీజీపీ ఎదురొచ్చి స్వాగతం పలకాలా అని అడిగారు. అబ్బయ్య చౌదరి పేరుకి సాఫ్ట్ వేర్, మనిషి హార్డ్‌వేర్ అంటూ మండిపడ్డారు. అలాంటి క్రిమినల్ అయిన అబ్బయ్య చౌదరికి అంబటి వత్తాసు ఏంటి? అని క్వశ్చన్ చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పళని నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యంపై దృష్టి పెడతామన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకి తెలియ చేస్తా.. క్యాబినెట్ దృష్టికి తీసుకు వెళ్తానని పేర్కొన్నారు.
Home Minister Anitha: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. వంశీ అరెస్ట్ లో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందన్నారు. అతడి అరెస్ట్ అక్రమం కాదు.. సక్రమమే అని పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు.. మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్.. ఆ తర్వాత పరిణామాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. వంశీని పోలీసు కస్టడీకి తీసుకుంటామని.. దీని కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. వల్లభనేని వంశీరి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాం.. నేరం చేసిన తర్వాత ఎవరూ తప్పించుకోలేని విధంగా టెక్నాలజీ ఉందన్నారు..