ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎన్నికల బరిలో మొత్తం 35 మంది అభ్యర్థులు నిలిచారు. 43 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ తుది గడువు ముగిసే నాటికి ఎనిమిది మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈనెల 27వ తేదీన ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్నది. 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. Also…
Ambati Rambabu: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో అర్థం కాలేదు అని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. వంశీ టీడీపీ కార్యాలయ దాడి ఘటనలో బెయిలుపై ఉన్నారు.. ఆయన అరెస్టు పట్ల అందరం దిగ్భ్రాంతి చెందాం.. టీడీపీ దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన వ్యక్తి మెజిస్ట్రేట్ వద్దకు వెళ్ళి తాను అసలు ఫిర్యాదు చేయలేదని చెప్పారు..
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి లేఖ రాశారు. లారీలపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు అమలైతే దేశవ్యాప్తంగా వాహన యజమానులు, డ్రైవర్లకు తీవ్రమైన ఇబ్బందులను కలుగుతాయని ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకొచ్చిన G.S.R. 124(E) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరి లేఖ రాశారు. ఈనెల 7న కేంద్ర ప్రభుత్వం…
AP MLC Elections 2025: ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పది మంది అభ్యర్థులు ఉన్నారని విశాఖ పట్నం జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి హరేందిర ప్రసాద్ తెలిపారు.
కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వల్లభనేని వంశీ సతీమణి వచ్చారు. వంశీని కలిసేందుకు ఆమెను పీఎస్ లోపలకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.. దీంతో మీడియాతో మాట్లాడియా వంశీ భార్య పంకజశ్రీ.. మమ్మల్ని ఎందుకు లోపలికి అనుమతించడం లేదని క్వశ్చన్ చేశారు.
వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్‌పై స్పందించిన ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడిని అందరూ చూశారని గుర్తుచేసిన ఆయన.. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరిగింది.. ఇందులో ఎలాంటి రహస్యం లేదని స్పష్టం చేశారు.. అయితే, ఫిర్యాదు చేసిన వ్యక్తి కేసును విత్‌డ్రా చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది.. పార్టీ కార్యాలయంలో పని చేసిన వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఇలా జరుగుతుందా..? వాళ్ల కుటుంబంపై ఎంత ఒత్తిడి తెచ్చిఉంటారని ఆగ్రహం…
కుంభకోణం సమీపంలోని స్వామిమలై క్షేత్రానికి వెళ్లిన ఆయన.. శ్రీ స్వామినాథ స్వామిని దర్శించుకున్నారు.. స్వామిమలై శ్రీ స్వామినాథ స్వామి వారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్రకు శ్రీకారం చుట్టారు. కంద షష్టి కవచ పారాయణంలో పాల్గొన్నారు.. ఆది ప్రణవనాదం ఓం కార మంత్ర రహస్యాన్ని సృష్టికి అందించిన క్షేత్రం.. షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో ఐదవ క్షేత్రం స్వామిమలై.. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా గురువారం తంజావూరు సమీపంలోని స్వామిమలైని సందర్శించారు పవన్.
వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు.. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ తో పాటు పోలీస్ యాక్ట్ - 30 అమలులో ఉన్నట్టు పేర్కొన్నారు.. ఈ సెక్షన్ అమలు నేపథ్యంలో నిరసనలు, ర్యాలీలపై పూర్తిగా నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు.. అయతే, పోలీసుల నిషేదాజ్ఞలను అతిక్రమించి వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు.