Vallabhaneni Vamsi: కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సుమారు 8 గంటల పాటు గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు ప్రశ్నించారు. కాగా, ఇప్పటికే జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి వైద్య పరీక్షలు పూర్తి కావడంతో.. విజయవాడలోని నాల్గవ అదనపు న్యాయమూర్తి ముందు వంశీని పోలీసులు ప్రవేశ పెట్టారు.
ఆటో డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. విజయవాడ, విశాఖ నగరాల్లో ఆటో రిక్షాల పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఎస్ 6, సీఎన్జీ, పెట్రోల్, ఎల్పీజీ, ఈవీ ఆటోల సంఖ్యపై పరిమితిని ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజా రవాణాలో భాగంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోన్నది. గతంలో విజయవాడ నగరంలో 8,700 ఆటో రిక్షాలు, విశాఖలో 8,400 ఆటో రిక్షాలకు…
Minister Sandhya Rani: విజయనగరంలోని వన్ టౌన్ పరిధిలో గల కలెక్టరేట్ దగ్గర తన బ్యాగ్ మిస్సైనట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్ మెన్ జీవి రమణ తెలిపారు. మిస్ అయిన బ్యాగులో 30 రౌండ్స్ కలిగిన గన్ మ్యాగ్జైన్ తో పాటు విలువైన పత్రాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి కోలుకుంటూ...పార్టీని రీ సెట్ చేసే పనిలో సీరియస్గా ఉన్నారట వైసీపీ అధ్యక్షుడు జగన్. ఆ క్రమంలోనే సీనియర్ నాయకులు ఒక్కొక్కరిని పిలిపించుకుని మాట్లాడుతూ... భరోసా ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ పరంగా చేయాల్సిన అన్ని పనులు గట్టిగానే చేద్దామని ధైర్యం చెబుతుండటంతో... మెల్లిగా ఒక్కొక్కరు అజ్ఞాతం వీడుతున్నారట.
CM Chandrababu: జల వనరుల శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల పని తీరుపై ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. నిర్ధేశించికున్న లక్ష్యాల మేర పనులు జరగకపోతే.. ఇటు అధికారులు, అటు కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అనుమతులు ఉండి నిధుల సమస్యలేని ప్రాజెక్టుల్లో జాప్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ ఎండికి లేఖ రాసింది. ఏపీపీటీడీ సంస్థలో క్లరికల్ సిబ్బందికి సంబంధించి ఇప్పటి వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఖాళీలలో ఉద్యోగులకు పదోన్నతి కల్పించి ఖాళీలను భర్తీ చేయకుండా ఆ ఖాళీలలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన రిటైర్ అయ్యే ఉద్యోగులను నియమిస్తు.. వీరందరికి లేబర్ డిపార్ట్ మెంట్ నిబంధనల ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. Also Read:Lavanya: నన్ను వాళ్లు…
Vallabhaneni Vamsi Arrest: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో తదుపరి చర్యలపై అతడి తరపు న్యాయవాదులు కసరత్తు చేస్తున్నారు. మాజీ అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమాలోచనలు కొనసాగిస్తున్నారు.
YSRCP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుపై ఫిర్యాదు చేసేందుకు మంగళగిరిలోని ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను వైసీపీ బృందం కలవడానికి వెళ్లింది. అయితే, డీజీపీ అందుబాటులో లేరని.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేక సమావేశానికి వెళ్లారని కార్యాలయ సిబ్బంది పేర్కొనింది. అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళినా కనీసం ఏ అధికారి మా రెప్రజెంటేషన్ ను కూడా తీసుకోవడం లేదని వైసీపీ బృందం ఆరోపించింది.
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎన్నికల బరిలో మొత్తం 35 మంది అభ్యర్థులు నిలిచారు. 43 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ తుది గడువు ముగిసే నాటికి ఎనిమిది మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈనెల 27వ తేదీన ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్నది. 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. Also…