కూటమి లో గ్యాప్ ఉంది అనేది కేవలం దుష్ప్రచారం మాత్రమే అని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ధర్మవరంలో కూడా పార్టీల మధ్య కూడా ఇటువంటి గ్యాప్ లేదు.. కేవలం క్షేత్రస్థాయిలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయని పేర్కొన్నారు.
AP CS Vijayanand: విజయవాడలో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఏపీ సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు. డ్రోన్లతో కాలువల స్ప్రేయింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఏపీ సీఎస్ సైతం పాల్గొన్నారు. యుర్వేదిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ దగ్గర ఏర్పాటు చేసిన పారిశుధ్య విధానాల స్టాల్స్ ను ఆయన పరిశీలించారు.
Mother Killed Son: ప్రకాశం జిల్లాలోని కంభం తెలుగు వీధిలో కందం శ్యామ్ ప్రసాద్ హత్య ఘటనపై పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. శ్యామ్ అనే వ్యక్తిని ఇద్దరు సోదరులు, మరో వ్యక్తి సాయంతో తల్లి లక్ష్మీదేవీ ( అలియాస్ సాలమ్మ) హత్య చేయించిందని నిర్థారించారు.
CM Chandrababu: నెల్లూరు జిల్లా కందుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు (ఫిబ్రవరి 15) పర్యటించబోతున్నారు. నేటి ఉదయం 11.45 గంటలకి టీఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతం వద్ద దిగి.. అక్కడి నుంచి కోవూరు రోడ్డు మీదగా దూబగుంట సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఎంఆర్ఎఫ్ ఫెసిలిటీ సెంటర్ (వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్)కు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
మదనపల్లి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళ తన్నులాట పీక్స్ చేరిందని అంటున్నారు. డజన్ మందికి పైగా నేతలు ఈ టికెట్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా... చివరికి అధినేత చంద్రబాబు మాత్రం మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషావైపు మొగ్గు చూపారు. దీంతో అసంతృప్తితో ఉన్న మిగతా నేతలు ఎన్నికల్లో షాజహాన్కు సహకరించలేదని చెప్పుకుంటారు. చివరికి కొన్ని చోట్ల ఏజెంట్లను కూడా పెట్టలేదట.
ఆస్తి విషయంలో తండ్రి శ్రీనివాసరావుతో గొడవ పెట్టుకున్న కొడుకు పుల్లారావు కొట్టి చంపాడని పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడని ఏసీపీ ప్రసాద్ రావు తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్, షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుని పుల్లారావు అప్పులపాలైయ్యాడని, ఆ అప్పులు తీర్చడానికి తండ్రి అంగీకరించకపోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డట్లు చెప్పుకొచ్చారు. అయితే, ఈ కేసును తప్పు దోవ పట్టించేందుకు పుల్లారావు పక్క పొలం చల్లా సుబ్బారావుతో గతంలో ఉన్న సరిహద్దు వివాదాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి తప్పించుకొనేందుకు ప్రయత్నించాడని…
పొన్నాడ సతీష్ కుమార్... ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే. 2009లో కాంగ్రెస్, 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో తొలిసారి ఓడిపోయారాయన. ఎన్నికల సమయంలో కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పని చేశారు.