Vizag: విశాఖపట్నంలో మందుల కోసం వచ్చి మెడికల్ షాప్ దగ్గరే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు విజయనగరం జిల్లా బుదరాయవలసకు చెందిన రమణ (60)గా గుర్తింపు.. నీలం వేప చెట్టు సమీపంలో మెడికల్ షాప్ లో మందులు కొంటూ ఉండగా గుండె పోటు రావడంతో.. మందులు కొంటూనే కుప్ప కూలిన మృతుడు రమణ.. వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసిన మెడికల్ స్టోర్ యజమాని.. అంబులెన్స్ వచ్చే సరికి ప్రాణాలు కోల్పోయినట్లు సిబ్బంది తెలిపింది.
Read Also: Afghanistan: మమ్ముల్ని సింపుల్‌గా చూడకండి.. ఆస్ట్రేలియాకు ఆఫ్గాన్ కోచ్ వార్నింగ్
ఇక, మెడికల్ షాపు దగ్గర రమణ అనే వ్యక్తి మరణించినట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అయితే, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.