ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.. అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు పనితీరుపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది..
దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. అభివృద్ధికి సూచికలు అని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తిరుపతి వేదికగా 2వ ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పోను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో కలిసి ప్రారంభించారు చంద్రబాబు.. మూడు రోజుల పాటుఈ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో కొనసాగనుంది.. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 55 కోట్లు మంది కుంభమేళాలో పవిత్రమైన స్నానాలు ఆచరించారు.. అంటే,…
జనసేన ఆవిర్భావ వేడుకలపై అధికారికంగా ఓ ప్రకటన చేసింది జనసేన పార్టీ.. వచ్చే నెల 14న జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు.. ఈ సారి పిఠాపురంలో ఆవిర్భావ వేడుకల నిర్వహణకు జనసేనాని నిర్ణయం తీసుకుంది.. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నాయి జనసేన శ్రేణులు.. ఈ మేరకు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు..
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రెగ్యులరేషన్పై ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులను ఇచ్చింది.. ఈ అంశానికి సంబంధించి కసరత్తు కూడా జరుగుతోంది... గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలను మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి దృష్టికి తీసుకు వెళ్లారు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘ నేతలు.. ఈ రోజు మంత్రి డోలతో సమావేశమైన ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘ నేతలు.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు..
రేపు వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విజయవాడ జిల్లా జైలులో కిడ్నాప్ కేసులో రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీని ఆయన రేపు కలుస్తారు.. ఇప్పటికే వంశీ భార్య పంకజశ్రీని ఫోన్లో పరామర్శించిన జగన్.. ఆమెకు భరోసా ఇచ్చారు.. వంశీ అరెస్ట్ రోజు జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. రేపటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆన్లైన్లో మే నెల శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. అందులో మొదటగా.. రేపు ఉదయం అనగా ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల కానున్నాయి.
ఈ రోజు జీబీఎస్ పై సమీక్ష సమావేశం నిర్వమించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జీబీఎస్ కేస్ లు వ్యాధి లక్షణాలపై అధికారులతో చర్చించారు.. ఈ వ్యాధి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు.. వ్యాధి నిర్ధారణ పరీక్షలపై దృష్టి పెట్టాలని సూచించారు..