Union Government: గత ఏడాది సంభవించిన విపత్తులు, వరదలకు సంబంధించిన సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు (ఫిబ్రవరి 19) ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు రూ.1554.99 కోట్ల అదనపు సాయాన్ని ఆమోదించింది.
Shivaji Maharaj Jayanti: మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించి, ధర్మ స్థాపన కోసం సామ్రాజ్యం స్థాపించిన గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ 395వ జయంతి నేడు. అయితే, ఛత్రపతి శివాజీ తెలుగు నేలపై నడయాడినట్లు తెలుస్తుంది.
వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాను రూపొందించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జీవో 117కు ప్రత్యామ్నాయ వ్వవస్థపై త్వరలోనే ప్రజాప్రతినిధులతో వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు. జూనియర్ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాల పెంపుపై త్వరలోనే సానుకూల నిర్ణయం ఉంటుందన్నారు లోకేష్.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎల్లుండి ఉదయం 11 గంటలకు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. దీనికి ప్రధాన కారణం.. సీఎం చంద్రబాబు.. హస్తిన పర్యటనే.. ఎందుకంటే, ఎల్లుండి ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారాన్ని బీజేపీ పెద్ద ఎత్తున నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు.
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రాజెక్ట్ తొలి దశలో భూసేకరణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో మెట్రో నిర్మాణానికి అవసరమైన భూమి వివరాలను అధికారులు ఖరారు చేశారు. విజయవాడలో మెట్రో రైలును రెండు కారిడార్లుగా అభివృద్ధి చేస్తున్నారు.
టీడీపీ విమర్శలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. బిగ్ బ్లాస్ట్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసింది.. వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తుందని.. గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులు అంటూ ఆరోపించింది.. కోర్టు ముందు సత్యవర్ధన్ స్టేట్మెంటే అందుకు నిదర్శనం.. చంద్రబాబు సర్కార్ కుట్రను బయటపెట్టిన సత్యవర్దన్ ఫిబ్రవరి 10, 2025 నాటి స్టేట్మెంట్ ఇచ్చారు..
ఆంధ్రప్రదేశ్లో ఓ యూట్యూబర్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.. అనంతపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది.. గుంతకల్ మండలం బుగ్గ సంఘాల గ్రామ సమీపంలో గత రెండు రోజుల క్రితం అదృశ్యమైన యూట్యూబర్ తిరుమలరెడ్డి.. మంగళవారం కసాపురం గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద శవమై తేలాడు..
"నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా జగన్ రెడ్డి గారు?'' అంటూ ఎద్దేవా చేశారు.. పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్ గా చెప్పడంలో మీరు పీహెచ్డీ చేసినట్టు ఉన్నారు అంటూ దుయ్యబట్టారు.. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి ఇకనైనా బయటకు రండి అని సూచించారు.. 100 మందికిపైగా వైసీపీ రౌడీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేయడం కోట్లాది ప్రజలు కళ్లారా చూశారని గుర్తుచేశారు..