Pendem Dorababu: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు కీలక నేతలు, ప్రజాప్రతినిధులు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతూనే ఉన్నారు.. కొందరు కాస్త సమయంలో తీసుకుని టీడీపీ.. జనసేన.. బీజేపీలో చేరిపోతున్నారు.. ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా త్వరలో జనసేనలో చేరతారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతూ వచ్చింది.. ఇప్పటికే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు.. అయితే, ఈ నెల 9వ తేదీన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. జనసేనలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.. కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు దొరబాబు.. ఇక, దొరబాబు చేరికకు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఈ నెల 9వ తేదీన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్ లతో కలిసి విజయవాడలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధం అయ్యారు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు..
Read Also: Gopireddy Srinivasa Reddy: పోసానిపై 14 కేసులా..? మీరు 3 కేసులు పెడితే రేపు 30 పెట్టే సమయం ఉంది..!
కాగా, గత ఏడాది ఆగస్టులో వైసీపీకి రాజీనామా చేశారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. రెండు మూడు నెలలుగా పరిస్థితులు మారాయని.. అందుకే వైసీపీకి రాజీనామా చేశానని ఆయన స్పష్టం చేశారు.. నియోజకవర్గ అభివృద్ధి కోసం పిఠాపురంలోనే ఉంటానని పేర్కొన్నారు. ఇక, తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు, అభివృద్ధి కోసం పిఠాపురంలోనే ఉంటానని పేర్కొన్నారు.. అనుచరులు, కార్యకర్తలతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.. అయితే, పెండెం దొరబాబు జనసేనలో చేరబోతున్నారని ప్రచారం జరుగోతన్న సమయంలో.. ఆయన వైసీపీని వీడడం చర్చగా మారింది.. ఇప్పుడు మొత్తంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలసి.. జనసేనలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకోవడంతో పాటు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు పెండెం దొరబాబు..
Read Also: Harassing On Horse: పెళ్లి ఊరేగింపులో గుర్రంపై దారుణం.. సిగరెట్ తాగించి ఆపై?
ఇక, 2019 ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు దొరబాబు.. అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ బరిలోకి దిగడంతో.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబుకు వైఎస్ జగన్ టికెట్ నిరాకరించారు. పవన్‌పై పోటీగా వంగా గీతను బరిలోకి దింపారు.. కానీ, ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గ్రాండ్ విక్టరీ కొట్టారు.. అప్పట్నుంచి సైలెంట్ అయిపోయారు దొరబాబు..