విజయవాడ జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను పరామర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.. అయితే, జగన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగింది తెలుగుదేశం పార్టీ.. టీడీపీ సీనియర్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. ఆ సమావేశంలో సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన దృశ్యాలు విడుదల చేశారు..
ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోయినా సమావేశాలను సీరియస్ గా తీసుకోవాలని సీఎం చంద్రబాబు మంత్రులు ఎమ్మెల్యే లకు చెబుతున్నారు.... ప్రతిపక్షం లేదని లైట్ తీసుకోవద్దన్నారు సీఎం...అధికార ప్రతిపక్ష పాత్ర రెండూ కూటమి నుంచే ఉండాలని ఆదేశాలు వెళ్లాయి
వల్లభనేని వంశీ మోహన్ కేసులో మరో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. కేసులో కీలకంగా ఉన్న సత్యవర్థన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ నెల 11వ తేదీన వల్లభనేని వంశీ, సత్యవర్దన్ సహా ఐదుగురిపై FIR రిజిస్టర్ చేశారు పోలీసులు.. 84/2025 కేసులో ఏ5గా ఉన్నారు సత్యవర్థన్.
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి.. ఏపీకి పవన్ కల్యాణ్ ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారని పేర్కొన్నారు.. ఇప్పుడు రాష్ట్ర అవసరాలు, విభజన హామీలు సాధించుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లో పలు యూనివర్సిటీలకు ప్రస్తుతం ఉన్న ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్ ల స్థానంలో రెగ్యులర్ వీసీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీ గా ఆంధ్రా యూనివర్సిటీ లో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రసన్న శ్రీ నియామకం అయ్యారు. కృష్ణ యూనివర్సిటీ వీసీ గా ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ కె రాంజీ నియామకం అయ్యారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ గా…
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముక్కు సూటి. మోనార్క్ ఎవరంటే...టక్కును గుర్తొచ్చే పేరు బొల్లా బ్రహ్మనాయుడు. ఆ మాజీ ఎమ్మెల్యేపై వైసీపీ నాయకులు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. వినుకొండ ఎమ్మెల్యేగా పని చేసిన బ్రహ్మనాయుడు...అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీ నాయకులనే కాదు...సొంత పార్టీ నాయకులను ఓ రేంజ్లో ఆడుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ పాలన సాగుతోంది. కూటమి ప్రభుత్వంగా ఒక్కటిగా ఉన్నా.. పార్టీల పరంగా ఎవరిదారిలో వారు వెళ్తున్నారు. రాజకీయంగా బలపడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా ఇటీవలే బీజేపీ కొన్ని చేరికలపై దృష్టి పెట్టింది... మొన్న రాజ్యసభలో కృష్ణయ్య కు అవకాశం ఇచ్చింది.. అలాగే కొంతమంది నేతలను చేర్చుకునే పనిలో పడింది బీజేపీ. అ
ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్ దాఖలు చేశారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కాసరనేని వెంకట పాండురంగారావు పై గత ఏడాది జరిగిన దాడికి సంబంధించి నమోదైన కేసులో పోలీసులు తనను ఇరికించే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు వంశీ..
మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారని కొంతకాలంగా ఏపీ పాలిటిక్స్‌లో చర్చ జరిగింది. ఆ ఊహాగానం నిజమే అని స్వయంగా సీఎం చంద్రబాబు ఆ మధ్య క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో ఒక వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం మీడియాకు నోట్ ఇచ్చిన సందర్భాలు బహుశా లేవేమో! ఒక్క నాగబాబు విషయంలోనే ఇలా జరిగింది.