CM Chandrababu and Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతోన్న వేళ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య కీలక చర్చలు జరిగాయి.. అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు ఛాంబర్‌కు వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్.. అసెంబ్లీ హాల్ నుంచి సిఎం చంద్రబాబుతో కలిసి ఆయన ఛాంబర్‌కు వెళ్లిన పవన్.. రాష్ట్ర బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపులపై సమావేశంలో చర్చించనట్టుగా తెలుస్తోంది.. అభివృద్ది పనులు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు పవన్ కల్యాణ్.. ఇక, మే నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత పథకాలపై ఈ భేటీలో చర్చకు వచ్చింది..
Read Also: RK Roja: రేపు అదే రిపీట్ అవుతుంది.. వడ్డీతో సహా తిరిగిచ్చేస్తారు.. రోజా వార్నింగ్
మరోవైపు, ఇప్పటికే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా రావడంతో.. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికపైనా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య చర్చలు సాగినట్టుగా తెలుస్తోంది.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పైనా సమావేశంలో చర్చించినట్లు సమాచారం.. అయితే, మొత్తంగా అసెంబ్లీలోని చంద్రబాబు ఛాంబర్‌లో జరిగిన సీఎం, డిప్యూటీ సీఎంల సమావేశంఉ దాదాపు గంట పాటు జరిగింది.. అసెంబ్లీకి వైసీపీకి దూరంగా ఉండడం.. శాసన మండలికి మాత్రం హాజరుకావడంపైనా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది.