Arani Srinivasulu: ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. జనసైనికులు, యువకులు, వీరమహిళలు, పవన్ కల్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కరూ సభకు హాజరై.. దేశంలో కనివిని రీతిలో జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ నెల 14 తేదీన పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయడంపై తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఇంఛార్జ్‌లతో సన్నాహత సమావేశాన్ని పార్లమెంట్ సమన్వయ కర్త హోదాలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నిర్వహించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 300 మందికి తగ్గకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు సభకు హాజరు అయ్యోల చూడాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే, కొంతమంది నియోజకవర్గ ఇంఛార్జ్‌లు ఐదు వందల మందిని సభకు తరలించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యేకు తెలిపారు.
Read Also: Hyderabad Crime: ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసిన కొడుకు..
ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ ఉంటుంది.. ఈ నెల 12,13, 14 తేదీల్లో జనసేన ఆవిర్భావ సభ సమావేశాలు ఉంటాయని వెల్లడించారు ఎమ్మెల్యే ఆరిణి శ్రీనివాసులు.. జనసేన ఆవిర్భావ సభ విజయవంతంపై అందరూ కృషి చేయాలని సూచించారు.. తిరుపతి పార్లమెంట్ పరిధిలో జనసేన ఆవిర్భావ దినోత్సవం కు భారీగా పార్టీ శ్రేణులు పాల్గొనేలా చూడాలని నిర్ణయించామని పేర్కొన్నారు.. ఆవిర్భావ దినోత్సవంలో జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.. జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే ఆరిణి శ్రీనివాసులు..