Pawan Kalyan: ఏపీలో గత రెండు రోజులు జరిగిన క్రీడల పోటీల విజేతలకు బహుమతులను సీఎం చంద్రబాబు, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సాధించిన ఘనత సీఎం చంద్రబాబు దే అన్నారు. కల్చరల్స్ చూస్తూ నేను చేసిన గబ్బర్ సింగ్ సినిమా గుర్తొచ్చింది.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతలా నవ్వడం ఎప్పుడూ చూడలేదు.. చంద్రబాబు లాంటి బలమైన నాయకుడిని కడుపుబ్బ నవ్వేలా చేసారు అని పేర్కొన్నారు. ఇంటికి వెళ్ళి కూడా నేను నవ్వుకుంటా.. ఎమ్మెల్యేలు అందరూ కొట్టుకు చావడం గత ఐదేళ్ళలో చూశామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
Read Also: Gachibowli Stadium: 200 మంది ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు ఆందోళన.. కారణమేంటంటే..?
ఇక, వేర్వేరు పార్టీల నాయకులుగా ఇలాంటి వేడుక నిర్వహించామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి నా కృతజ్ఞతలు.. సమస్యలు వస్తే ఐక్యతగా పోరాడే సమానత్వ స్ఫూర్తినిచ్చింది.. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మరో 15 సంవత్సరాలు పట్టొచ్చు.. సీఎం చంద్రబాబు దగ్గర పని చేయడం నాకు ఎప్పుడూ సమ్మతమే అని పేర్కొన్నారు.