AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక, ఉద్యోగుల బకాయిల చెల్లింపులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే, ఉద్యోగులకు 6,200 కోట్ల రూపాయలు చెల్లించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రేపు సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఎఐ కింద రూ. 6,200 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేయనుంది. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఉద్యోగులకు అండగా ఉన్నామన్న ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఉద్యోగుల వివిధ బకాయిల కింద 1,033 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది.