Marri Rajasekhar: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు దేశం పార్టీలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వైఎస్ జగన్ పై అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను.. నాలుగు సంవత్సరాలు అధికారం వదులుకొని జగన్ కోసం పార్టీ మారిన నన్ను గుర్తించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సారి జగన్ మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోకపోవడం.. నన్ను తీవ్రంగా బాధించింది అన్నారు.
Read Also: Transgender Murder Case: అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్..
అయితే, 2019లో నాకు మంత్రి పదవి ఇస్తాను అన్నారు.. బహిరంగంగా సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయాన్ని చెప్పారు అని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ అధ్యక్షుడుగా పని చేశాను.. పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశా.. 53,000 ఓట్లతో ఓడిపోయిన వారికి ఇక్కడ ఇంఛార్జ్ గా బాధ్యతలు ఇవ్వడం నాకు అర్థం కావడం లేదు.. నాకు ఇంచార్జ్ పదవీ ఇస్తామని చెప్పి మళ్ళీ గుంటూరులో ఓడిపోయిన వాళ్ళని ఇక్కడ ఎందుకు తెచ్చారో అర్థం కాలేదని మర్రి రాజశేఖర్ చెప్పుకొచ్చారు.