Visakhapatnam: రాంగ్ కాల్ ద్వారా పరిచయమైన మహిళతో సాన్నిహిత్యం పెంచుకున్న తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన బి అక్షయ్ కుమార్.. ఆమెతో తీసుకున్న వీడియోలను చూపించి బెదిరించి 4 కోట్ల రూపాయల నగదుతో పాటు 800 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేశాడు. అప్పటికే, అతడి వేధింపులు ఎక్కువ కావడంతో బాధిత కుటుంబ సభ్యులు విశాఖలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు.. శ్రీకాళహస్తికి చెందిన బి.అక్షయ్‌కు కరోనా సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళతో రాంగ్‌కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది. తరువాత ఆమెకు కాల్ చేయగా స్పందించకపోవడంతో మెస్సెజ్ లు పంపడం స్టార్ట్ చేశాడు.. ఆ క్రమంలో ఆమె వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నాడు.. తనతో స్నేహం చేయాలని.. లేకపోతే తన వద్ద వాయిస్ రికార్డులు.. నీ భర్తకు పంపిస్తానని ఆ మహిళను బెదిరించేవాడని పోలీసులు తెలిపారు.
Read Also: MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఔరంగజేబ్ సమాధిని కూల్చి…
అలాగే, తన కోరిక తీర్చాలంటూ పదేపదే సదరు మహిళను వేధింపులకు గురి చేశాడని విశాఖ త్రీటౌన్ పోలీసులు తెలిపారు. ఆ వేధింపులు ఆగకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం.. మొబైల్ సిగ్నల్ ఆధారంగా నిందితుడు తిరుపతిలో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇక, నిందితుడు దగ్గర నుంచి 65 గ్రాముల బంగారం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నాం.. బ్యాంకులో ఉన్న సుమారు రెండు కోట్ల రూపాయల నగదు సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.