* నేడు షబ్బీర్ అలీ ఇంటికీ సీఎం రేవంత్ రెడ్డి.. రంజాన్ వేడుకలకు హాజరుకానున్న సీఎం రేవంత్..
* నేడు నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన.. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి కోమటిరెడ్డి..
* నేడు రాష్ట్ర బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షుల భేటీ.. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశం.. పార్టీ సంస్థగత అంశాలు, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చ.. ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలపై చర్చ..
* నేడే రంజాన్.. ఈద్గాలు, మసీదుల దగ్గర ఏర్పాట్లు చేసిన అధికారులు.. హైదరాబాద్ లో రంజాన్ పండగ వేడుకలు.. మీరాలం ఈద్గా, మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు..
* నేడు మునగపాకలో మంత్రి నారా లోకేశ్ పర్యటన.. అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డుకు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్..
* నేడు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట హాజరుకావాలని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి పోలీసుల నోటీసులు.. కాకాణి ఇంట్లో లేకపోవడంతో గేట్ కు నోటీసులు అంటించిన పోలీసులు.. అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా కాకాణి గోవర్థన్ రెడ్డిని చేర్చిన పోలీసులు..
* నేడు కడప జిల్లాలో ఉగాది ఉత్సవాల్లో భాగంగా పిడకల సమరం.. ఆస్పరి మండలం కైరుప్పలలో శ్రీ వీరభద్రస్వామి, కాళీకాదేవీ కళ్యాణ మహోత్సవంలో భాగంగా పిడకల సమరం.. రెండు వర్గాల మధ్య సంప్రదాయంగా వస్తున్న పిడకల సమరం..
* నేటితో శ్రీశైలంలో ముగియనున్న ఉగాది మహోత్సవాలు.. ఉదయం యాగశాలలో ఉగాది మహోత్సవాల పూర్ణాహుతి.. సాయంత్రం అశ్వవాహనంపై ఆశీనులై పూజలందుకొనున్న ఆదిదంపతులు.. నిజాలంకరణతో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు..
* నేడు ఏపీలో భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. 38 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం..
* నేడు తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. గాలిలీ భారీగా పడిపోయిన తేమ శాతం.. తీవ్రమైన వేడితో అల్లాడుతున్న జనం.. పలు ప్రాంతాల్లో 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం..
* నేటి అర్థరాత్రి నుంచి హైదరాబాద్- విజయవాడ హైవేపై తగ్గనున్న టోల్ రుసుములు.. టోల్ రుసుము తగ్గడంతో వాహనదారులకు భారీ ఊరట..
* నేడు ఐపీఎల్ లో ముంబై వర్సెస్ కోల్ కతా మ్యాచ్.. ముంబై వేదికగా రాత్రి 7.30 గంటలకి మ్యాచ్..