శ్రీకాకుళానికి చెందిన క్యాన్సర్ పెషేంట్ తో హోం మంత్రి అనిత విడియో కాల్ మాట్లాడారు. ఎనిమిది సంవత్సరాలుగా క్యాన్సర్ తో పోరాడుతున్న లతశ్రీకి ధైర్యం చెప్పారు. మంత్రి అనిత మాట్లాడుతూ.. ధైర్యాన్ని మించిన మెడిసిన్ ఏదీ లేదన్నారు. లతశ్రీని బాధపడొద్దని.. పిల్లలున్నారని.. మీకు మేమంతా అండగా ఉంటామని మంత్రి అనిత చెప్పారు. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నవారు కూడా ధైర్యంగా ఎదుర్కొని ఆరోగ్యంగా ఉంటున్నారు. మీరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. కుటుంబ సభ్యులు అండగా ఉండాలని ధైర్యం కోల్పోవద్దని కోరారు.
Also Read:German: రాకెట్ ప్రయోగం విఫలం.. ఎగిరిన 40 సెకన్లలోనే భారీ విస్ఫోటనం
ఆ తర్వాత లతశ్రీ పిల్లలతో మాట్లాడారు. వారి చదువులు, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనితను చూడాలని లతశ్రీ కోరింది. త్వరలోనే శ్రీకాకుళం వచ్చి మిమ్మల్ని కలుస్తానని హోం మంత్రి అనిత మాట ఇచ్చారు. ఎప్పుడైన మాట్లాడాలనిపిస్తే నాకు వెంటనే ఫోన్ చెయ్యాలని చెబుతూ హోం మంత్రి అనిత లతశ్రీకి భరోసా ఇచ్చారు. స్వయంగా హోం మంత్రి అనిత వీడియో కాల్ చేసి మాట్లాడడంతో లతశ్రీకి వెయ్యేనుగుల బలం వచ్చినంతగా సంతోషం వ్యక్తం చేసింది.