ఆంధ్రప్రదేశ్ లో పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేకపోతే p4 కార్యక్రమం ఉండేది కాదన్నారు. నాలో సరైన సత్తా లేక ఓట్లు చీలిపోతాయని చంద్రబాబుకు మద్దతు పలికానన్నారు. ఈ ఉగాది చరిత్రలోనే మిగిలిపోతుంది. ఏదో ఒక సహాయం.. అది మాట సాయం అయినా చేసే వారు కావాలి.. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం స్వర్ణాంధ్ర అవుతుందని అన్నారు.
Also Read:Allu Arjun : అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్.. ఆ రోజే ఆర్య-2 రీ రిలీజ్..
పబ్లిక్ ప్రొవైడ్ పీపుల్ కలిసి పని చేస్తారు. ఏ ప్రభుత్వం కూడా ఇంత బలమైన కార్యక్రమం చెయ్యలేదు. నాకు సత్తా లేకనే నేను 2014 నుంచి పోటీ చేయకుండా చంద్రబాబుకు మద్దతు ఇస్తూ వచ్చా నాకు సత్తా లేనప్పుడు ప్రజలకు మేలు చేసే వాళ్లకు సపోర్ట్ చేయాలని చేశా. 2024 లో కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే ఈరోజు చంద్రబాబు సీఎం కాకపోతే రాష్ట్రం ఏమైపోయేది?.. ఎదిగే దశలో సరైన గైడెన్స్ ఉంటే మంచి విజయాలు సాధిస్తారు. చంద్రబాబు కూడా చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చారు. అందరూ ఎదగాలి అనేది.. నాది.. చంద్రబాబు తాపత్రయం అని చెప్పారు.