Vangalapudi Anitha: జిల్లాకు ఒక సైబర్ క్రైం పోలీస్ స్టేషన్..!
- గుంటూరు రేంజ్ పరిధిలో అధికారులతో హోంమంత్రి సమీక్ష..
- కొత్తగా 10 పీఎస్ లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి..
- జిల్లాకు ఒక సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vangalapudi Anitha: కొత్తగా పది పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి.. జిల్లాకు ఒక సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం అన్నారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. గుంటూరు రేంజ్ పరిధిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు హోంమంత్రి.. గుంటూరు, రాజధాని అమరావతి, హైకోర్టు, పొలిటికల్ పార్టీల ఆఫీసులు ఈ ప్రాంతంలో ఉన్నాయని.. పల్నాడులో ఫ్యాక్షన్ కొన్నిచోట్ల ఉంది.. నలభై గ్రామాల్లో ఫ్యాక్షన్ కనిపిస్తుందన్నారు.. ఇక, సైబర్ క్రైం ప్రకాశం జిల్లాలో జీరో వెల్లడించారు అనిత.. గుంటూరు జిల్లాలో అనేక కేసుల్లో రికవరీ బాగుందన్న ఆమె.. పోలీసుల భద్రత చూడాల్సిన అవసరం ఉంది. గుంటూరు జిల్లాలో పోలీసులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: Viral Video: జిమ్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి.. చివరికి ఏమైందో చూడండి (వీడియో)
Also Read
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
ఇక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై పోక్సో కేసుల్లో శిక్షలు పడ్డాయని తెలిపారు హోం మంత్రి అనిత.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 కోట్లు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. పబ్లిక్, ప్రైవేట్ ప్లేసులలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను కోరారు.. మరోవైపు, బాపట్ల సముద్రతీరప్రాంతంలో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నాం. ప్రజల రక్షణే భద్రతగా పోలీసులు పనిచేస్తున్నారు. కొత్తగా పది పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. జిల్లాకు ఒక సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం అన్నారు.. ప్రమోషన్ల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి… వాటిపై దృష్టి పెడతామన్నారు.. గత ఐదేళ్లలో పోలీస్ శాఖలో రిక్రూట్‌మెంట్ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..
తాజావార్తలు
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!