Palla Srinivas: విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ రేగుతోన్న వేళ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్.. అసలు, విశాఖ అభివృద్ధి కోసమే మేయర్ పై అవిశ్వాసం పెట్టినట్టు తెలిపారు.. నాలుగేళ్ల తర్వాత పాలనను సమీక్షించుకునే అవకాశం చట్టం కల్పించింది.. 9 నెలల కోసం రాజకీయ ప్రయోజనాలను ఆశించిన మార్పు కోరుకునే వాళ్లం కాదన్నారు.. మేం ఎవరినీ ఒత్తిళ్లకు గురిచేయలేదు.. అటువంటి ఆలోచనలు ఉంటే గత ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరించేవాళ్లం అన్నారు.. నో కాన్ఫిడెన్స్ లో నెగ్గేందుకు అవసరమైన సంఖ్యాబలం మాకు ఉంది.. విశాఖపట్నం గ్రేటర్ అవిశ్వాసం మ్యాజిక్ ఫిగర్ పై పూర్తి విశ్వాసంతో కూటమి పార్టీలు ఉన్నాయని తెలిపారు పల్లా శ్రీనివాస్..
Read Also: Canada: కెనడాలో కాల్పుల కలకలం.. భారతీయ విద్యార్థిని మృతి
అయితే, విశాఖ మేయర్‌పై అవిశ్వాసం విషయంలో.. చివరి క్షణంలో కూటమిలో చేరి మేజిక్ ఫిగర్ ను సరిచేశారు వైసీపీ మాజీ ఎమ్మెల్యేల వారసులు.. ఆఖరిలో కూటమికి మద్దతు ప్రకటించారు అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక, తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీ రెడ్డి.. మరికాసేపట్లో ప్రత్యేక వాహనాల్లో GVMC కి బయల్దేరనున్నారు కూటమి కార్పొరేటర్ లు.. హోటల్ లో కూటమి కార్పొరేటర్ లతో సమావేశమైన ఎమ్మెల్యేలు, ఎంపీలు.. సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలను కార్పొరేటర్లకు వివరించారు..