Koramutla Srinivasulu: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు విజయవాడలోని సిట్ విచారణ కార్యాలయం దగ్గరకు వచ్చిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్.. విజయసాయిరెడ్డి మా పార్టీ నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి.. ఆయన టీడీపీ స్క్రిప్ట్ చదువుతున్నాడు అని ఆరోపించారు.. అయితే, వైఎస్ జగన్ కు సన్నిహితంగా ఉండే వారిపై బురద చల్లాలనే ఉద్దేశ్యంతో ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చిందని విమర్శించారు.. సిట్ కావాలనే ఇదంతా చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వంలోనే గుడులు, బడుల దగ్గర బెల్ట్ షాపులు పెరిగాయని టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చెప్పారని వ్యాఖ్యానించారు.. నేరుగా టీడీపీ ఎమ్మెల్యేనే కూటమి ప్రభుత్వం తీరుపై విమర్శలు చేసిన పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు.. గత ప్రభుత్వంలో లిక్కర్ అమ్మకాలపై కాదు.. సిట్ విచారణ కూటమి ప్రభుత్వంలో లిక్కర్ వ్యాపారంపై చేయాలని డిమాండ్ చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్..
Read Also: Bollywood : నా ఫ్యామిలీ జోలికి రావద్దు.. అనురాగ్ కశ్యప్ కామెంట్స్ వైరల్