Police Constable Murder Case: ఏపీలో కానిస్టేబుల్ హత్య ఘటన కలకలం సృష్టించింది.. అయితే, ఈ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం పెద్ద కంబులూరుకి చెందిన కానిస్టేబుల్ ఫరూక్.. మంగళగిరి లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా పనిచేస్తూ నాలుగు రోజుల క్రితం అదృశ్యం కాగా.. మృతదేహం నల్లమల అటవీ ప్రాంతంలో పచ్చర్ల వద్ద బయటపడింది. నాలుగు రోజుల క్రితం సెలవుపై వచ్చిన ఫరూక్ ఆచూకీ దొరకకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో ఫరూక్ మృతదేహం అటవీ ప్రాంతంలో బయటపడింది. ఈ హత్యకు ఓ మహిళతో వివాహేతర సంబంధం, ఆ మహిళ కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, కుమార్తె ప్రియునితో వివాదం వెరసి హత్యకు దారుతీసినట్లు సమాచారం.
Read Also: Nirmal: ఇవాళ స్వగ్రామానికి దుబాయ్ లో హత్యకు గురైన అష్టపు ప్రేమ్ సాగర్ మృత దేహం..
కానిస్టేబుల్ ఫరూక్ కి నంద్యాల నందమూరి నగర్ కు చెందిన ఓ వివాహిత మహిళతో పరిచయం ఏర్పడింది.. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. గతంలో ఈ మహిళ పెద్ద కమ్మలూరులో ఉండేది. భర్తకు దూరమై నంద్యాలలోనే నందమూరి నగర్ లో వచ్చి కూతురుతో సహా నివాసం ఉంది. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ మహిళకు తరచూ డబ్బులు, ఇంటి సరుకులు ఇచ్చేవాడు ఫరూక్. మహిళ ఇంటికి సరుకులను అందజేయడానికి షబ్బీర్ అనే యువకుడిని ఏర్పాటు చేసుకున్నారు కానిస్టేబుల్ ఫరూక్. సరుకులు తెచ్చి ఇచ్చే సమయంలో ఆ మహిళ కుమార్తె (18) కన్నేశాడు షబ్బీర్. మహిళా కుమార్తెతో ప్రేమలో పడ్డారు షబ్బీర్. ఇద్దరికి పెళ్లి చేయమని మహిళను అడగ్గా నిరాకరించిందని సమాచారం. కానీ, వాళ్ల ప్రేమ బంధం కొనసాగుతూ వచ్చింది.. ఈ క్రమంలో కానిస్టేబుల్ ఫరూక్ తన ప్రియురాలి కుమార్తెను అనుభవించాలనుకున్నాడు. యువతిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో అతని వేధింపులు భరించలేక తన ప్రియుడు షబ్బీర్ కు ఆ విషయాన్ని చెప్పింది సదరు యువతి.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
అయితే, తన ప్రేమకు అడ్డుగా ఉండడమే కాక ప్రియురాలు వేధించడంతో కానిస్టేబుల్ ఫరూక్ ను లేపేయాలనుకున్నాడు షబ్బీర్. అందుకు పక్కా ప్లాన్ వేశాడు షబ్బీర్. మంగళగిరి నుండి కానిస్టేబుల్ నేరుగా నాలుగైదు రోజుల క్రితం నందమూరి నగర్ కి వచ్చాడు. తర్వాత షబ్బీర్ మాయమాటలు చెప్పి అతని కారులో ఎక్కించుకొని చాగలమర్రి ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు. మిత్రుడు రిజ్వాన్ తో కలిసి కానిస్టేబుల్ కు మద్యం తాగించి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని అక్కడే విసిరేశారు. అయితే హత్య కేసు అవుతుందని నల్లమల అడవిలో మృతదేహాన్ని కుళ్లిపోయి ఎవరికి తెలియకుండా పోతుందని భావించి, ప్లాస్టిక్ కవర్ లో కట్టి కారులో తీసుకెళ్లి పచ్చర్ల సమీపంలోని దొరబావి వంతెన వద్ద లోయలో మృతదేహాన్ని విసిరేశారు.
Read Also: GVMC: ఉత్కంఠ రేపుతున్న వైజాగ్ మేయర్ అవిశ్వాసం.. మేజిక్ ఫిగర్ పై కొనసాగుతున్న ఊగిసలాట..
మంగళగిరి హెడ్ క్వార్టర్ నుండి వచ్చిన కానిస్టేబుల్ ఫరూక్ తిరిగి విధుల్లోకి చేరలేదు. దీంతో అతనిపై ఆరా తీశారు. ఆయన ఇంటికి కూడా చేరలేదని తెలియడంతో విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్, ఫోన్ ట్రాకింగ్ ద్వారా నందమూరి నగర్ ప్రాంతానికి వచ్చినట్లు కనిపెట్టారు. మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా కొన్ని వివరాలను అందజేసింది. వీటి ఆధారంగా హత్య జరిగిందని నిర్ధారించుకొని మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకుని వారిచ్చిన సమాచారం ద్వారా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళతోపాటు, షబ్బీర్, రిజ్వాన్ పోలీసుల అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. అయితే, ఈ వ్యవహారం కలకలం సృష్టించింది..