ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ఎయిర్ పోర్టు దగ్గర కాపు కాసిన సిట్ అదుపులోకి తీసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రాజ్ కేసిరెడ్డి. మూడు సార్లు సిట్ నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదు కేసిరెడ్డి.. రేపు విచారణకు వస్తానంటూ ఈ మధ్యాహ్నం ఆడియో విడుదల చేశారు. రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు.
Also Read:Extramarital Affairs: పెరిగిపోతున్న ఇల్లీగల్ ఎఫైర్స్.. భర్తలనే చంపేస్తారా..?
ఇప్పటికే రాజ్ కేసిరెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సీఐడీ.. ఇమ్మిగ్రేషన్ సమయంలో ఏపీ పోలిసులకు సమాచారం.. ఇవాళ రాత్రి విజయవాడకి రాజ్ కేసిరెడ్డి ని తీసుకువచ్చే అవకాశం.. రాజ్ కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని అధికారికంగా ధృవీకరించిన అధికారులు.. రేపు సిట్ ఎదుట విచారణకు హాజరు అవుతానని ఇవాళ ఆడియో విడుదల చేసిన రాజ్ కేసిరెడ్డి.. ఇప్పటి వరకు నాలుగు సార్లు సిట్ రాజ్ కేసిరెడ్డికి నోటీసులు ఇచ్చినా విచారణకు గైర్హాజరు.. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వచ్చే వారానికి వాయిదా వేయటంతో విచారణకు వస్తున్నట్టు తెలిపిన రాజ్ కేసిరెడ్డి.. రోడ్డు మార్గాన రాజ్ కేసిరెడ్డిని విజయవాడ తీసుకు వస్తున్న సిట్.. రేపు విచారణకు వస్తాడో రాడో అని అనుమానంతో అదుపు తీసుకోవడం జరిగింది అని సిట్ అధికారులు చెప్తున్నారు.