Heart Attack: ఎప్పుడు..? ఎవరు? ఎలా? ప్రాణాలు వదులుతున్నారు తెలియని పరిస్థితి.. ఇక, ఏజ్‌తో సంబంధం లేకుండా గుండెపోటుతో ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి.. బాగా ఫిట్‌గా ఉన్నవాళ్లు సైతం ఈ కోవాలో ఉండడం కూడా ఆందోళన కలిగించే విషయం.. ఇక, క్రికెట్ గ్రౌండ్‌లోనే గుండె ఆగి.. యువకులు చనిపోయిన సందర్భాలు లేకపోలేదు.. అలాంటి ఘటన ఇప్పుడు పల్నాడు జిల్లాలో జరిగింది.. జిల్లాలోని వినుకొండలో క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురైన గౌస్ బాషా అనే యువకుడు కుప్పకూలిపోయాడు.. అయితే, వెంటనే ఆస్పమత్తమైన తోటి క్రికెటర్లు.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు గౌస్ భాష.. క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగింది.. మృతుడు గౌస్ బాషాకు మూడేళ్లక్రితమే వివాహం కావడంతో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.. గౌస్ బాషా మృతితో కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు..
Read Also: Somu Veerraju: కూటమిలో ప్రతి చర్యతో జగన్‌కు జ్ఞానోదయం కలగాలి..!
కాగా, తాజాగా తెలంగాణలోనూ ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ ప్రాణాలు విడిచిన విషయం విదితమే.. మేడ్చల్ జిల్లా కీసర పీఎస్ పరిధిలోని రాంపల్లి దాయరలో.. క్రికెట్ ఆడుతుండగా గ్రౌండ్‌లో ప్రణీత్ అనే 32 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు పాత బోయినపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు.. అయితే, ఫిట్ నెస్ కోసం పిల్లలు, యువకులు ఆటలు ఆడుతుంటారు.. కానీ, గ్రౌండ్ లోనే ఇలా ప్రాణాలు వదలడం ఆందోళన కలిగిస్తోంది..